Indian Railways: 11 స్టేషన్లు, 176 కి.మీల పొడవైన సొరంగం.. మనదేశంలో ఈ రైలు మార్గం చూస్తే ఫిదా అవుతారంతే..!
Rishikesh Karnaprayag Railway Line: భారతీయ రైల్వేలు పర్వతాల పైన, సొరంగాల నుంచే కాకుండా నీటిలో నుంచికూడా వెళ్తుంటాయి.
Rishikesh Karnaprayag Railway Line: పర్వతాలు, సొరంగాల నుంచే కాకుండా నీటిలో కూడా రైళ్లు వెళ్తుంటాయి. కశ్మీర్‌ను రైల్వే లైన్‌తో అనుసంధానించిన తర్వాత ఇప్పుడు రిషికేశ్‌ను కొత్త బ్రాడ్‌గేజ్ రైలు మార్గం ద్వారా కర్ణప్రయాగకు అనుసంధానం చేస్తున్నారు. ఈ మార్గంతో ఉత్తరాఖండ్ దేవభూమిలో రైల్వే కనెక్టివిటీ మెరుగుపడనుంది.
దేవభూమిలోని బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రిలకు భక్తులు ఈ రైలు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. రిషికేశ్-కర్ణప్రయాగ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.
ఈ ప్రాజెక్టులో భాగంగా స్టేషన్ల నిర్మాణం, టన్నెల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం 213 కి.మీ సొరంగాల్లో 176 కి.మీ ఇప్పటికే నిర్మించారు. ఈ మార్గంలో 11 స్టేషన్లను కూడా నిర్మిస్తున్నారు. ఈ రైలు మార్గం ఉత్తరాఖండ్‌లోని ఐదు జిల్లాలకు రైలు కనెక్టివిటీని కూడా పెంచుతుంది. తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది.