Indian Railway: రైలు కదిలిన 10 నిమిషాల తర్వాత బుక్ చేసుకున్న సీటును చేరుకోకుంటే.. టికెట్ రద్దు అవుతుందా? షాకిస్తోన్న రైల్వే కొత్త రూల్..!
Indian Railway Ticket Rules: ఇప్పుడు రైలు ప్రయాణంలో మీరు బుక్ చేసుకున్న సీటుకు చేరుకోవడంలో ఆలస్యమైతే.. ఈ కారణంగా మీ టికెట్ రద్దు అయ్యే అవకాశం ఉంది. ఇందులో నిజం ఎంత అనేది తెలుసుకుందాం..
Indian Railway Ticket Rules: నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ జామ్‌ల సమస్యతోపాలు రోడ్డు రవాణాలో పట్టే సమయం కారణంగా, ఎక్కుమంది ప్రజలు రైలులో జర్నీ చేస్తుంటారు. అయితే, రైలులో సాఫీగా జర్నీ చేయాలంటే మాత్రం టిక్కెట్ కన్‌ఫాం అవ్వాల్సి ఉంటుంది. లేదంటే జర్నీ ఇబ్బందిగా మారుతుంది. అయితే, ఒకట్రెండు స్టేషన్ల తర్వాత కూడా ప్రయాణికుడు రైలులో తన కన్‌ఫాం బెర్త్‌కు చేరుకోకుంటే.. టీటీఈ టిక్కెట్ దారుడు సీట్లో ఉన్నాడని లెక్కలు వేసుకుంటాడు. అయితే ఇప్పుడు రైలు ఎక్కేందుకు 10 నిమిషాల కంటే ఎక్కువ ఆలస్యమైతే వారి టికెట్‌ను రద్దు చేసి సీటును మరో ప్రయాణికుడికి ఇస్తారని చెబుతున్నారు. ఈ ఆర్డర్ నిజమా లేక పుకారు మాత్రమేనా, అనే దారి గురించి వివరంగా తెలుసుకుందాం..
TTE కేవలం 10 నిమిషాలు మాత్రమే వేచి ఉంటాడా?
నివేదిక ప్రకారం, ఇప్పుడు ప్రయాణీకుడు (Indian Railway Ticket Rules) ప్రయాణాన్ని ప్రారంభించాల్సిన స్టేషన్ నుంచి రైలు ఎక్కవలసి ఉంటుంది. టీటీఈ తనిఖీలో సదరు ప్రయాణికుడు వారికి కేటాయించిన సీటులో కనిపించకపోతే, ఆ ప్రయాణికుడి కోసం కేవలం 10 నిమిషాలు వేచి ఉంటాడు. ఆ తర్వాత, అతన్ని గైర్హాజరు రికార్డులో నమోదు చేస్తాడు. దీంతో పాటు ఆ రద్దయిన సీటు రైలులో ప్రయాణించే మరో ప్రయాణికుడికి కేటాయిస్తుంటాడు.
వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు..
ఇప్పటి వరకు TTE పేపర్ లిస్ట్‌లో వారితో ఉన్న ప్రయాణీకుల హాజరును గుర్తించేందుకు కేవలం రిజర్వేషన్ ఛార్ట్‌ను మాత్రమే చూసేవాడు. ఈ క్రమంలో అతను ప్రయాణీకుల కోసం తదుపరి స్టేషన్ వరకు వేచి ఉండేవాడు. అయితే ఇప్పుడు వారికి హ్యాండ్ హోల్డ్ టెర్మినల్ ఇచ్చారు. దీని ద్వారా అతను ప్రయాణికుల టిక్కెట్లను తనిఖీ చేస్తుంటాడు. వారు వచ్చారా లేదా అనే వివరాలను ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్ చేస్తున్నాడు. దీనితో పాటు భారతీయ రైల్వే రికార్డులలో సదరు ప్రయాణికుల వివరాలు కూడా నమోదుచేస్తుంటాడు.
ఆలస్యమైనా టికెట్ రద్దు అయ్యే అవకాశం..
నివేదిక ప్రకారం, ఇప్పుడు టిక్కెట్‌ను బుక్ చేసిన తర్వాత, ప్రయాణీకులు తమ బోర్డింగ్ స్టేషన్ నుంచి రైలు ఎక్కి వారి సీట్లకు చేరుకోవాలి. అలా చేయని పక్షంలో వారి టిక్కెట్లను రద్దు చేసి ఇతర ప్రయాణికులకు ఇవ్వవచ్చు. రద్దీలో ఇరుక్కుపోతే చాలాసార్లు టీటీఈ ప్రయాణీకుల సీటుకు చేరుకోవడంలో ఆలస్యం కావచ్చు. ఇటువంటి పరిస్థితిలో, ప్రయాణీకుడు కొంత అదనపు సమయాన్ని పొందవచ్చు. కానీ, అలా చేసినా రిజర్వేషన్ చేసిన టిక్కెట్ ఉంటుందా లేదా టీటీఈ లేదా సమయం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎక్కడ నుంచి సీటు బుక్ చేశారో అక్కడికి సమయానికి చేరుకోవడం మంచిది.