Indian Railway: వెయిటింగ్ లిస్ట్‌ టికెట్స్‌తో ఇకపై నో పరేషాన్.. రన్నింగ్ ట్రైన్‌లోనూ ఈజీగా సీట్ బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే?

Indian Railway: మీరు వెయిటింగ్ టిక్కెట్‌తో రైలులో ప్రయాణిస్తున్నారా.. సీటు పొందాలనుకుంటే, మీరు నిమిషాల వ్యవధిలో రైలులో ఖాళీ సీటును కనుగొనవచ్చు.

Update: 2023-04-29 14:30 GMT

Indian Railway: వెయిటింగ్ లిస్ట్‌ టికెట్స్‌తో ఇకపై నో పరేషాన్.. రన్నింగ్ ట్రైన్‌లోనూ ఈజీగా సీట్ బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే?

Indian Railway: మీరు వెయిటింగ్ టిక్కెట్‌తో రైలులో ప్రయాణిస్తున్నారా.. సీటు పొందాలనుకుంటే, మీరు నిమిషాల వ్యవధిలో రైలులో ఖాళీ సీటును కనుగొనవచ్చు. అవునండీ.. దీని కోసం రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా బెర్త్ స్థితిని తనిఖీ చేయాలి. ఏ కోచ్ ఖాళీగా ఉంది, ఏ బెర్త్ ఖాళీగా ఉంది అనేది మీరు తెలుసుకోవచ్చు. దీంతో ఆ సీటును టీటీఈ ద్వారా మీ పేరు కోసం రిజర్వ్ చేసుకోవచ్చు. ఇది చాలా సులభం. మీ ప్రయాణం సాఫీగా సాగుతుంది.

సీట్లు ఎక్కడ ఖాళీగా ఉన్నాయో ఇలా తెలుసుకోవచ్చు..

రైల్వేలో ప్రయాణిస్తుంటే, రైలులో సీటు బుక్ చేసుకోవాలనుకుంటే, మీరు IRCTC అధికారిక వెబ్‌సైట్‌ను ఉపయోగించవచ్చు. ఇందుకోసం, మీరు హోమ్ పేజీలో బుక్ టిక్కెట్ల ట్యాబ్‌ను క్లిక్ చేయాలి. అందులో PNR స్టేట్, చార్ట్/ఖాళీ ట్యాబ్‌ను చూడొచ్చు. చార్ట్, ఖాళీని కలిగి ఉన్న ట్యాబ్‌పై క్లిక్ చేయడం ద్వారా రిజర్వేషన్ చార్, ప్రయాణ వివరాల ట్యాబ్ ఓపెన్ అవుతుంది.

మీరు ప్రయాణ వివరాల ట్యాబ్‌ను ఓపెన్ చేయగానే, మీరు రైలు నంబర్, స్టేషన్, ప్రయాణ తేదీతో పాటు బోర్డింగ్ స్టేషన్ పేరును నమోదు చేయాలి. ఆ తర్వాత, మీరు తరగతి, కోచ్ ఆధారంగా సీట్ల వివరాలను పొందవచ్చు. ఏ కోచ్‌లో ఏయే సీట్లు ఖాళీగా ఉన్నాయో పూర్తి సమాచారం మీకు లభిస్తుంది. ఈ విధంగా, మీరు రైలులో ఖాళీగా ఉన్న సీటును కనుగొని, సీటును బుక్ చేసుకోవచ్చు. తద్వారా మీ ప్రయాణం సాఫీగా సాగుతుంది.

ఈజీగా బుక్ చేసుకోవచ్చు..

భారతీయ రైల్వేలో కొన్నేళ్ల క్రితం వరకు వెయిటింగ్‌ టికెట్‌పై ప్రయాణిస్తుంటే, సీటు కోసం టీటీఈకి అప్పీల్ చేయాల్సి వచ్చేది. దీంతో వారికి సీటు రావ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుండ‌డంతో పాటు కొన్ని సార్లు సీట్ల కేటాయింపులో గందరగోళం నెలకొనేది. ఈ సమస్యను పరిష్కరించడానికి, భారతీయ రైల్వే ఇప్పుడు ఆన్‌లైన్‌లో సీట్ల లభ్యత డేటాను చూపడం ప్రారంభించింది. దీంతో ప్రయాణికులు బెర్తుల లభ్యత గురించి సమాచారం తెలుసుకుని ఖాళీగా ఉన్న సీట్లను ఇట్టే తెలుసుకోవచ్చు. మీరు ఈ లింక్ https://www.irctc.co.in/online-charts/ క్లిక్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అయితే దీని కోసం మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

Tags:    

Similar News