Independence Day 2024: నిత్యపూజలు జరిగే మహాత్మా గాంధీ గుడి ఇది.. ఎక్కడుందంటే..?

దేశ స్వాతంత్ర సాధనలో ముఖ్యపాత్ర పోషించిన మహాత్మా గాంధీ ఉద్యమస్ఫూర్తి భావితరాలకు తెలిపేలా గ్రామ గ్రామాన మహానేత విగ్రహాలు పెట్టి స్మరించుకోవాలని నల్గొండ జిల్లా వాసులు తలిచారు.

Update: 2024-08-15 03:30 GMT

Independence Day 2024: నిత్యపూజలు జరిగే మహాత్మా గాంధీ గుడి ఇది.. ఎక్కడుందంటే..?

Independence Day 2024: మహాత్మా గాంధీ కేవలం ఒక స్వాతంత్ర్య సమరయోధుడిగానే కాదు జాతి పిత కూడా. దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన నుంచి భారతావనికి స్వాతంత్ర్యాన్ని అందించడంలో ఆయన పాత్ర కీలకం. న్యాయవాది అయినప్పటికీ అన్ని అవకాశాలను, విలాసాలను వదులుకుని తన జీవితం మొత్తం దేశానికి సేవ చేసేందుకు అంకితం చేశారు. అంతటి మహాత్ముని గూర్చి ఆగష్టు 15 సందర్భంగా మనమూ ఓసారి సర్మించుకుందాం. ఆయన ఉద్యమస్పూర్తిని గుర్తు చేసుకుందాం.

దేశ స్వాతంత్ర సాధనలో ముఖ్యపాత్ర పోషించిన మహాత్మా గాంధీ ఉద్యమస్ఫూర్తి భావితరాలకు తెలిపేలా గ్రామ గ్రామాన మహానేత విగ్రహాలు పెట్టి స్మరించుకోవాలని నల్గొండ జిల్లా వాసులు తలిచారు. అందులో భాగంగా చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులో జాతీయ రహదారి పక్కన మహాత్మా గాంధీకి గుడి నిర్మించి నిత్య పూజలు జరుపుతున్నారు. మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్ వారు ఇక్కడ మహాత్మా గాంధీ ఆలయంతో పాటు పంచభూతాల విగ్రహాలతో పాటు ధ్యాన మందిరం నిర్మించారు. ఇక్కడ వివిధ ప్రాంతాల నుండి సేకరించిన గ్రంథాలను, మట్టిని గుడిలో భద్రపరిచారు.

గ్రామంలో ఎక్కడోచోట మహాత్మా గాంధీ విగ్రహాలు పెట్టి ఏదో ఒక రోజు వాటికి దండలు వేసి ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్న ఈ రోజుల్లో కాపర్తి గ్రామంలో మహాత్మా గాంధీకి గుడి నిర్మించి నిత్యం పూజలు చేస్తూ ఆయనను స్మరించుకోవడం తమకెంతో ఆనందాన్నిస్తుందని స్థానికులు చెబుతున్నారు. భావితరాలకు ఆయన చేసిన ఉద్యమస్ఫూర్తిని తెలిపే విధంగా తమ ప్రాంతంలో ఆలయం నిర్మించడం సంతోషంగా ఉందంటున్నారు.

Tags:    

Similar News