కృష్ణాష్టమి స్పెషల్ : మన వెండితెర కృష్ణులు వీళ్ళే

ద్వాపరయుగంలో విష్ణువు కృష్ణావతారం ఎత్తాడు ... గోపికలతో ఆయన చేసిన చిలిపి పనులు , యశోదతో అయన చేసిన అల్లర్లు అన్ని ఇన్ని కావు . అంతేకాకుండా అదే అవతారంలో అయన హిందువులకు భగవద్గీతను అందించి జీవిత సత్యాలను నేర్పాడు..

Update: 2019-08-23 09:19 GMT

ద్వాపరయుగంలో విష్ణువు కృష్ణావతారం ఎత్తాడు ... గోపికలతో ఆయన చేసిన చిలిపి పనులు , యశోదతో అయన చేసిన అల్లర్లు అన్ని ఇన్ని కావు . అంతేకాకుండా అదే అవతారంలో అయన హిందువులకు భగవద్గీతను అందించి జీవిత సత్యాలను నేర్పాడు.. అయన జన్మష్టమి సందర్భంగా తెలుగు వెండితెరపై కృష్ణుడి పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన సినీ హీరోల గురించి స్పెషల్ ఫోకస్ ఆన్ హెచ్ఎంటీవీ ...

తెలుగు సినిమా చరిత్రలో పౌరాణిక చిత్రాలకి పెట్టింది పేరు నందమూరి తారకరామారావు ... రాముడు అయిన కృష్ణుడు అయిన ఏదైనా అందులో అయన నటన , అయన ఆహార్యం అలా అచ్చం దేవుడే కిందికి వచ్చాడా అన్నట్టుగా అయన వేషధారణ ఉండేది . మొదటగా ఎన్టీఆర్ కృష్ణుడిగా మాయా బజార్ సినిమాలో కనిపించారు . కృష్ణుడి గెటప్ లో అయన ప్రేక్షకులను నిజంగానే మాయ చేసారు . ఇక అ సినిమా తరవాత 'దీపావళి', 'భక్త రఘునాథ్', 'శ్రీకృష్ణార్జున యుద్ధం','కర్ణ (తమిళ్ డబ్బింగ్), 'వీరాభిమన్యు', 'శ్రీకృష్ణపాండవీయం', 'శ్రీకృష్ణతులాభారం', 'శ్రీకృష్ణావతారం','శ్రీకృష్ణవిజయం', 'శ్రీకృష్ణసత్య','శ్రీకృష్ణాంజనేయ యుద్ధం', 'దాన వీర శూర కర్ణ', శ్రీ మద్విరాట పర్వం లాంటి సినిమాల్లో కృష్ణుడు వేషంలో కనిపించారు .

ఇక ఎన్టీఆర్ తర్వాత కాంతారావు కృష్ణుడుగా మనకి కనిపించారు . నర్తనశాల, బభ్రువాహన, పాండవ వనవాసం, ప్రమీలార్జునీయం లాంటి సినిమాల్లో కృష్ణుడు గెటప్ లో కనిపించి అందరిని ఆకట్టుకున్నారు . ఇక వారికీ సమకాలిన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని నాగేశ్వరరావు కృష్ణుడుగా పెద్దగా కనిపించకున్నా గోవుల గోపన్న అనే సినిమాలో మాత్రం కృష్ణుడుగా కనిపించి ఆకట్టుకున్నారు . ఇక శోభన్ బాబు బుద్దిమంతుడు సినిమాలో కృష్ణుడిగా కనిపించారు . బాపు దర్శకత్వంలో వచ్చిన సాక్షి అనే సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ కాసేపు కృష్ణుడిగా కనిపించి మెప్పించారు . ఇక అ తర్వాత 'కన్నయ్య కిట్టయ్య' సినిమాలో రాజేంద్రప్రసాద్ కృష్ణుడిగా మరియు భక్తుడిగా కనిపించి మంచి పేరు సంపాదించుకున్నారు .

ఇక నేటి తరం కధానాయకులు కూడా కృష్ణుడి గెటప్ లో కనిపించి మెప్పించినవారే .. అందులో ముందుగా నాగార్జున 'కృష్ణార్జున' అనే సినిమా ల శ్రీకృష్ణుడిగా కనిపించారు . కానీ ఇక్కడ ఓ సామాన్యమైన వ్యక్తిగానే నాగార్జున కనిపిస్తారు . అ తర్వాత అందాల రాముడు సినిమాలో సునీల్, గోపాల గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా కనిపించి వెండితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు . 

Tags:    

Similar News