Google trends in June: జూన్ నెలలో గూగుల్ లో వీటికోసమే వెదికారు!

Google trends in June: రెండు నెలల క్రితం నుంచి గూగుల్ లో కరోనా దే పైచేయి. ఇప్పుడు మాత్రం అది కాదు. జూన్ నెలలో ఎక్కువ మంది గూగుల్ లో వెతికినది ఏమిటో తెలుసా?

Update: 2020-07-02 17:24 GMT
Sushant sing and solar eclipse are trend in google

ఆవకాయ నుంచి అంతరిక్షం వరకూ ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా గూగుల్ ను అడిగేస్తారు నేటిజనం. చిన్న విషయాన్ని కూడా గూగుల్ చెబితేనే నమ్మే పరిస్థితి ఉందిప్పుడు. ప్రతి రోజు ఎన్నో విషయాల గురించి గూగుల్ లో వెతుకుతూ ఉంటారు. ప్రతి నెల ఏ విషయాన్ని జనం వెతికారు అనే అంశాన్ని గూగుల్ చెబుతుంటుంది. 

రెండు నెలల క్రితం నుంచి గూగుల్ లో కరోనా దే పైచేయి. కరోనా అంటే ఏమిటి? కరోనా వైరస్ సోకితే కనిపించే లక్షణాలేమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఎక్కడెక్కడ ఎంత మంది ఈ వ్యాధి బారిన పడ్డారు ఇలా ఎన్నో విషయాలను గూగుల్ లో వెదికారు ప్రజలు. దాంతో కరోనా త్రెందింగ్ లో నిలిచింది. అయితే, జూన్ నెలలో మాత్రం ఆ ట్రెండ్ కనిపించలేదు. కరోనా గురించి ప్రజలు మెల్లమెల్లగా పక్కకు జరుగుతున్నారు. అంటే దాని విషయంలో కొత్తగా ఏమీ తెలుసుకోవాలనే ఆసక్తి తగ్గుతోంది. జూన్ నెలలో మూడో స్థానంలో కరోనా నిలవడమే దీనికి తార్కాణం. మరి గూగుల్ లో అత్యధిక వెదుకులాట దేనికోసం జైరిగిందో తెలుసా? 

సుశాంత్ సింగ్.. ఈ పేరును సుశాంత్ కు సంబంధించిన విషయాలను అత్యధికంగా జూన్ నెలలో గూగుల్ లో వెతికారు నేటిజనం. గత నెలలో ఈ బాలీవుడ్ నటుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అటు తరువాత [ప్రజలు ఎక్కువగా తెలుసుకోవాలని ఇంట్రస్ట్ చూపించిన విషయం సూర్యగ్రహణం! దీనికి సంబందించిన అన్ని విషయాలను తెగ వెతికేశారు. ఇక కరోనా మూడో స్థానంలో ఉంది. 

జూన్ 14న సుశాంత్ గురించి.. జూన్ 21 న సూర్యగ్రహణం గురించి చాలా ఎక్కువగా వెతికారు. ఇండియాలో సూర్యగ్రహణం గురించి 4,550 శాతం వెతికారు. అయితే, అదేరోజు వచ్చిన [ఫాదర్స్ దే గురించి మాత్రం 1,050 శాతం మందే వెతకడం విశేషం 

 

 

Tags:    

Similar News