Indian Railways: దేశంలోనే 5 స్పెషల్ రైల్వే స్టేషన్స్ ఇవే.. వీటి ప్రత్యేకత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారంతే?

Railway Station Managed By Women: మహిళలు ఏ విషయంలోనూ పురుషుల కంటే వెనుకంజ వేయడం లేదు.

Update: 2023-09-14 07:16 GMT

Indian Railways: దేశంలోనే 5 స్పెషల్ రైల్వే స్టేషన్స్ ఇవే.. వీటి ప్రత్యేకత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారంతే?

Railway Station Managed By Women: మహిళలు ఏ విషయంలోనూ పురుషుల కంటే వెనుకంజ వేయడం లేదు. అన్ని రంగాల్లోనూ తమ సత్తా చాటుతూ.. మగవారితోపాటు దూసుకపోతున్నారు. అలాగే భారతీయ రైల్వేలు కూడా మహిళల అభ్యున్నతిలో ముఖ్యమైన సహకారం అందిస్తున్నాయి. ఈ క్రమంలో 5 రైల్వే స్టేషన్ల బాధ్యతను మహిళలకు అప్పగించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఈ స్టేషన్లను పూర్తిగా మహిళలే నిర్వహిస్తున్నారు.

చంద్రగిరి రైల్వే స్టేషన్..

ఆంధ్రప్రదేశ్ రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వేలోని గుంతకల్ సెక్షన్‌లో ఉంది. దేశంలో కేవలం మహిళలే నిర్వహించే స్టేషన్. ఈ రైల్వేస్టేషన్‌లో స్టేషన్‌మాస్టర్‌ నుంచి పోలీసు సిబ్బంది వరకు ఉద్యోగులంతా మహిళలే.

మాతుంగా రైల్వే స్టేషన్..

ముంబైలోని మాతుంగా రైల్వే స్టేషన్ సెంట్రల్ రైల్వే పరిధిలోకి వస్తుంది. ఈ రైల్వే స్టేషన్ మొత్తం వ్యవస్థ కేవలం మహిళా ఉద్యోగులే నిర్వహిస్తున్నారు. మహిళా సిబ్బందిని నియమించడం వల్ల ఈ రైల్వే స్టేషన్ 2018లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరింది.

గాంధీ నగర్ రైల్వే స్టేషన్..

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఉన్న గాంధీ నగర్ రైల్వే స్టేషన్ పూర్తిగా మహిళలే నిర్వహిస్తున్నారు. దేశంలో మహిళలు మాత్రమే నిర్వహించే తొలి స్టేషన్ ఇదే. ఇక్కడ స్టేషన్ మాస్టర్ నుంచి టికెట్ చెకర్ వరకు ప్రతి ఉద్యోగి మహిళే.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్మించిన మణినగర్ దేశంలో నాల్గవ రైల్వే స్టేషన్. ఒక స్టేషన్‌ మాస్టర్‌, 23 మంది క్లర్క్‌లతో సహా 26 మంది ఉద్యోగులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఇది కాకుండా రైల్వే సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన 10 మంది మహిళా సైనికులు ఇక్కడ భద్రతను నిర్వహిస్తున్నారు.

అజ్ని రైల్వే స్టేషన్..

అజ్ని రైల్వే స్టేషన్ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో నిర్మించారు. ఇది దేశంలో మూడవ రైల్వే స్టేషన్. మహారాష్ట్రలో రెండవది. ఇక్కడ ఉద్యోగులందరూ మహిళలే. సెంట్రల్ రైల్వే పరిధిలోని ఈ స్టేషన్ నుంచి రోజుకు 6 వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.

Tags:    

Similar News