బిర్యానీ నుంచి జిలేబీ వరకు ఏవి భారతీయ వంటకాలు కావు..! ఎక్కడి నుంచి వచ్చాయంటే..?

Indian Dishes: మనం రోజూ తినే ఆహార పదార్థాలు మన దేశానివి కావని తెలిస్తే అందరు షాక్‌ అవుతారు...

Update: 2021-11-17 08:45 GMT

బిర్యానీ నుంచి జిలేబీ వరకు ఏవి భారతీయ వంటకాలు కావు..! ఎక్కడి నుంచి వచ్చాయంటే..?

Indian Dishes: మనం రోజూ తినే ఆహార పదార్థాలు మన దేశానివి కావని తెలిస్తే అందరు షాక్‌ అవుతారు. ముఖ్యంగా ఆహార ప్రియులు అస్సలు తట్టుకోలేరు. ప్రజలు తరచుగా సమోసా, గులాబ్ జామ్‌, జిలేబీ, టీ, బ్రెడ్, పకోడి వంటి వాటిని తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఈ రుచికరమైన ఆహారాలను తినకుండా ఎవ్వరూ ఉండలేరు. వాస్తవానికి ఇవేమి భారతీయ వంటకాలు కావు. ఒకప్పుడు విదేశీ వ్యాపారులతో భారతదేశంలోకి ప్రవేశించిన వంటకాలు. అయితే ఇవి ఏ దేశాల నుంచి వచ్చాయో తెలుసుకుందాం.

1. బిర్యానీ

హైదరాబాదీ బిర్యానీ భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందింది. బిర్యానీ హైదరాబాద్‌లో పుట్టిందని అందరు అనుకుంటారు. కానీ బిర్యానీ టర్కిష్ సంప్రదాయ వంటకం.

2. టీ

అవును టీ లేకుండా రోజు అసంపూర్ణంగా ఉంటుంది. టీ తోనే ప్రతి ఉదయం ప్రారంభమవుతుంది. ఆ టీ కూడా భారతదేశానికి చెందినది కాదు. భారతీయులు ఇష్టపడే టీ బ్రిటన్ నుంచి వచ్చింది.

3. సమోసా

సమోసా అంటే అందరికీ చాలా ఇష్టం. సాయంత్రం వేడి వేడిగా తింటారు. దాని సువాసన చాలా ఇష్టంగా ఉంటుంది. అయితే సమోసా భారతదేశపు ఆహారం కాదు. నిజానికి సమోసా మధ్యప్రాచ్య దేశాల నుంచి వచ్చింది. ఒకప్పుడు దీనిని 'సంభోసా' అని పిలిచేవారు.

4. గులాబ్‌ జామ్

వేడి వేడి గులాబ్ జామ్ తినడం మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. గులాబ్ జామ్‌ అంటే అందరికీ పిచ్చి. ఫంక్షన్ వైభవాన్ని పెంచే ఈ వంటకం పర్షియన్ దేశాల నుంచి భారతదేశానికి వచ్చింది.

5. జిలేబీ

జిలేబీకి దాని సొంత రుచి ఉంటుంది. దాదాపు అందరూ పెరుగు, జిలేబీ తినడానికి ఇష్టపడతారు. జలేబీ పర్షియన్, అరబ్‌ దేశాల నుంచి వచ్చిందని చెబుతారు. అయితే దాని పేరులో ఎలాంటి మార్పు చేయకపోవడం ఆశ్చర్యకరం.

Tags:    

Similar News