Misbehave In Hospital: హాస్పిటల్‌లో దురుసు ప్రవర్తన వద్దు.. ఈ నియమాలు తెలుసుకోండి..!
Misbehave In Hospital: కొన్ని ప్రదేశాల్లో దురుసుగా ప్రవర్తించడం వల్ల అనుకోకుండా చిక్కుల్లోపడుతారు. అందుకే ఆలోచించి ఏ పనైనా చేయాలి. చాలామంది హాస్పిటల్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తారు.
Misbehave In Hospital: కొన్ని ప్రదేశాల్లో దురుసుగా ప్రవర్తించడం వల్ల అనుకోకుండా చిక్కుల్లోపడుతారు. అందుకే ఆలోచించి ఏ పనైనా చేయాలి. చాలామంది హాస్పిటల్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తారు. అది వారు కావాలని చేసింది కాదు. తమ వారికి సరైన ట్రీట్‌మెంట్ అందించలేదని, లేదంటే మరేదైన ఇతర సంఘటనల వల్ల ఇలా జరుగుతుంది. కానీ హాస్పిటల్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
వైద్యులతో దురుసుగా ప్రవర్తించవద్దు
హాస్పిటల్‌లో రోగికి సరైన వైద్యం అందక కుటుంబ సభ్యులు వైద్యులు, సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తిస్తారు. పలుమార్లు వైద్యులపై దాడి ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా వైద్యులు దీనిపై ఆందోళనకు దిగారు. ఇలాంటి విషయాలపై కఠిన చట్టం తేవాలని డిమాండ్ చేయడంతో ప్రభుత్వం 10 సంవత్సరాల జైలు శిక్ష విధించే ఒక చట్టం చేసింది.
1. మీరు హాస్పిటల్ పనితీరును అడ్డుకుంటే IPC సెక్షన్ 353 ప్రకారం 2 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు.
2. మీరు హాస్పిటల్‌లో డాక్టర్, నర్సు, వార్డ్ బాయ్ మొదలైన వారితో దురుసుగా ప్రవర్తిస్తే సెక్షన్ 504 ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష విధిస్తారు.
3. డాక్టర్, నర్సు లేదా ఇతర సిబ్బందిని చంపుతామని బెదిరిస్తే మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.
4. మీరు డాక్టర్ లేదా సిబ్బందిపై దాడి చేస్తే మూడు నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.
5. హాస్పిటల్‌లో ఏ రకమైన విధ్వంసం చేసినా మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు.
6. ఐపీసీ చట్టాల ప్రకారం హాస్పిటల్స్‌లో దురుసు ప్రవర్తనకు వ్యతిరేకంగా చర్య తీసుకోవడానికి నిబంధనలు ఉన్నాయి. ఎవరైనా అలాంటి పని చేసినట్లు రుజువైతే కొన్నాళ్ల పాటు జైలుశిక్ష పడే అవకాశం ఉంది.