Railway Interesting Facts: రైల్వే ట్రాక్ పక్కన 'H' గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? రీజన్ తెలిస్తే అవాక్కవుతారంతే..!

Railway Interesting Facts: భారతీయ రైల్వే తన ప్రయాణీకుల కోసం 24 గంటలు పని చేస్తుంది. రైలు డ్రైవర్ అంటే లోకో పైలట్‌ కోసం అనేక గుర్తులు ఉన్నాయి. వీటిలో 'H' గుర్తు కూడా ఒకటి.

Update: 2023-06-03 03:30 GMT

Railway Interesting Facts: భారతీయ రైల్వే ప్రయాణీకుల కోసం 24 గంటలు పని చేస్తుంది. ఈ 24 గంటల్లో ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రతి క్షణం ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందుకోసం రైల్వేశాఖ పటిష్టమైన వ్యవస్థను కూడా సిద్ధం చేసింది. ఆటోమేషన్ యుగంలో కూడా కొంతమంది అధికారులు, ఉద్యోగులు రైలు ఆపరేషన్ సురక్షితంగా జరుగుతుందా లేదా అనే దానిపై మాత్రమే శ్రద్ధ వహిస్తుంటారు. దీని కోసం అనేక రకాల చిహ్నాలు, సైన్ బోర్డులను ఉపయోగిస్తుంటారు. అయితే, రైల్వే ట్రాక్ పక్కన కనిపించే 'H' గుర్తు గురించి తెలుసుకుందాం..

లోకో పైలట్ కోసం..

రైలు డ్రైవర్ అంటే లోకో పైలట్‌ కోసం అనేక గుర్తులు ఉన్నాయి. వీటిలో 'H' గుర్తు కూడా ఒకటి. ఈ గుర్తు ప్రత్యేకంగా లోకో-పైలట్‌లకు మాత్రమే. ఇది 'H'కి హాల్ట్‌ని సూచించడానికి ఉపయోగిస్తుంటారు.

లోకల్ ప్యాసింజర్ రైళ్ల కోసం..

ఇది సాధారణంగా లోకల్ ప్యాసింజర్ రైళ్ల ఆపరేషన్ ప్రక్రియలో ఉపయోగిస్తుంటారు. ప్యాసింజర్ రైలును గమ్యస్థానం వైపు తీసుకెళ్తున్న లోకో-పైలట్‌లు 'H' గుర్తును చూసిన వెంటనే.. ఓ విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. ఈ 'H'ని చూసిన వెంటనే ముందు ట్రైన్ ఆగే స్టేషన్ వస్తుందని అర్థం. ఈ 'H' గుర్తు స్టేషన్ నుంచి కొంత దూరంలో లేదా ఒక కిలోమీటరులో ఉందని గుర్తు చేసుకుంటాడు.

ఈ గుర్తు చాలా కీలకమైనది..

లోకో పైలట్లు ఈ గుర్తును చూసిన తర్వాత రైలు వేగాన్ని తగ్గించేస్తాడు. హాల్ట్ అంటే ఆగిపోవడం. ఈ హాల్ట్ స్టేషన్లు ఏదైనా గ్రామం లేదా పట్టణంలోని స్టేషన్ కోసం సిద్ధం చేశారన్నమాట. ఈ హాల్ట్ స్టేషన్లలో అన్ని రైళ్లు ఆగవు. ఎంపిక చేసిన కొన్ని రైళ్లు మాత్రమే ఈ స్టేషన్లలో కొంత ఆలస్యంగా ఆగుతాయి. అత్యవసర పరిస్థితుల్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఈ హాల్ట్ స్టేషన్లలో ఆగుతాయి.

Tags:    

Similar News