Bike Riding: వర్షాకాలంలో బైక్ నడిపేటప్పుడు మరిచిపోయికూడా ఈ తప్పులు చేయకండి..
Bike Riding: వర్షాకాలంలో బైక్ నడిపేటప్పుడు మరిచిపోయికూడా ఈ తప్పులు చేయకండి..
Bike Riding: మీరు వర్షాకాలంలో బైక్‌పై వెళ్లేటప్పుడు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వాస్తవానికి వర్షాకాలంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో బైక్ రైడింగ్ ఒక చెప్పలేని అనుభూతిని అందిస్తుంది. కానీ రైడర్ కొన్ని విషయాల్లో శ్రద్ధ వహించకపోతే అది ప్రమాదంగా మారే అవకాశాలు ఉంటాయి. ఈ పరిస్థితిలో వర్షాకాలంలో బైక్ నడుపుతున్నప్పుడు పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం.
అరిగిన టైర్ మార్చుకోవాలి
వర్షాకాలంలో మీరు బైక్ నడుపుతుంటే మీ బైక్ టైర్లు ఖచ్చితంగా కొత్తవిగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే బైక్ టైర్ అరిగిపోయి ఉంటే రోడ్డుపై జారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంచి గ్రిప్ లేని టైర్‌ని ఉపయోగించడం వల్ల మీరు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొత్త టైర్లని మార్చుకుంటే మంచిది.
హై స్పీడ్ బైకింగ్
వర్షాకాలంలో సరదా కోసం కూడా బైక్‌ని అతివేగంగా నడపకూడదు. ఎందుకంటే రోడ్లు తడిగా ఉంటాయి. దానిపై బైక్ వేగంగా జారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు అధిక వేగంతో బ్రేకులు వేసినప్పుడు టైర్లు జారిపోయి బైక్ అదుపుతప్పుతుంది. ఇది ప్రమాదానికి దారి తీస్తుంది.
బైక్ రైడ్
వర్షాకాలంలో కొన్నిచోట్ల నీరు నిలిచిపోతుంది. ఈ పరిస్థితిలో మీరు అలాంటి ప్రదేశాలకి దూరంగా వెళ్లాలి. ఎందుకంటే అది డ్రేనేజి కావొచ్చు లేదా దేనికోసమైనా తీసిన గుంతైనా కావొచ్చు. అలాగే ఎక్కువ నీరు ఉండే ప్రదేశాల గుండా వెళ్లడం వల్ల బైక్ ఇంజిన్ పాడయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే చూసుకొని బైక్ నడపడం చాలా ముఖ్యం.