Evening: సాయంత్రం పూట మరిచిపోయి కూడా ఈ పనులు చేయకండి..!

Evening: హిందూ గ్రంధాలలో ప్రతిదానికీ కొన్ని ప్రత్యేక నియమాలున్నాయి.

Update: 2022-03-26 13:30 GMT

Evening: సాయంత్రం పూట మరిచిపోయి కూడా ఈ పనులు చేయకండి..!

Evening: హిందూ గ్రంధాలలో ప్రతిదానికీ కొన్ని ప్రత్యేక నియమాలున్నాయి. వాటిని పాటించడం వల్ల కుటుంబంలో, జీవితంలో ఆనందం, శాంతి ఉంటుందని నమ్ముతారు. అంతే కాకుండా భగవంతుని ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఈ పరిస్థితిలో సాయంత్రం ఏ పనులు చేయకూడదో ఒక్కసారి తెలుసుకుందాం. సూర్యాస్తమయం సమయంలో ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచి ఉంచాలి. ఇంటి మెయిన్ డోర్ కూడా మూయకూడదు. సాయంత్రం వేళలో లక్ష్మి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్మకం. కాబట్టి సూర్యుడు అస్తమించే సమయంలో తలుపు తెరిచి ఉంచాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంటికి చేరుతుందని, కుటుంబంలో ఐశ్వర్యం ఉంటుందని నమ్మకం.

సాయంత్రం మరచిపోయి కూడా ఎవరికీ సూదులు, వెల్లుల్లి-ఉల్లిపాయలు ఇవ్వకూడదు. అలాగే వీటిని ఎవరి వద్ద నుంచి తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులు నివసిస్తాయని చెబుతారు. అంతే కాకుండా సాయంత్రం పూట ఇంటి నుంచి ఈ వస్తువులను తొలగించడం అశుభం అని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల ఇంటి సభ్యుల మధ్య పరస్పర సమన్వయం తగ్గుతుంది. సాయంత్రం పూట ఆహారం తీసుకోవడం నిషిద్ధం. సూర్యాస్తమయం సమయంలో ఆహారం తీసుకోవడం వల్ల ఆయుష్షు తగ్గిపోతుందని మహాభారతంలో ప్రస్తావించారు.

సంప్రదాయ విశ్వాసాల ప్రకారం సాయంత్రం పూట తులసిని తాకకూడదు. నిజానికి తులసిని రాధా-రాణి రూపంగా పరిగణిస్తారు. ఈ సమయంలో తులసిని తాకకుండా దీపం చూపిస్తే సరిపోతుంది. సూర్యాస్తమయం సమయంలో డబ్బు లావాదేవీలు చేయకూడదు. సాయంత్రం ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి లేదా ఎవరి నుంచి డబ్బు తీసుకోకండి. సూర్యాస్తమయం సమయంలో చేసే దానధర్మాలు ఇబ్బందులను కలిగిస్తాయి. ఉదయాన్నే డబ్బుకు సంబంధించిన పనులు చేయడం శుభప్రదంగా భావిస్తారు.

Tags:    

Similar News