మూగ జీవాల ఆకలి రోదన..

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దాన్ని అరికట్టడానికి దేశమంతటా లాక్ డౌన్ నిర్వహిస్తున్నారు.

Update: 2020-04-12 07:37 GMT
Animals in Lockdown

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దాన్ని అరికట్టడానికి దేశమంతటా లాక్ డౌన్ నిర్వహిస్తున్నారు. ఏరోజైతే లాక్ డౌన్ మొదలయిందో ఆరోజు నుంచి మనుషులకే కాదు మూగజీవాలకు కూడా కష్టాలు మొదలయ్యాయి. మనుషులకేమో పనులు లేక చేతిలో డబ్బు లేని పరిస్థితి వచ్చేసింది. పశుపక్షులకేమో దుకాణాల వద్ద గింజలు, మార్కెట్లలో మిగిలిపోయిన ఆకుకూరలు, కూరగాయలు తిని బతికే వాటికి లాక్ డౌన్ కారణంగా ఆహారం దొరకడం లేదు. రోడ్లపై ఎంత తిరిగినా ఎక్కడా ఆహారం వాటికి దొరకట్లేదు. ఇక అడవిలో ఉండే కోతులు చెట్లు నరికేయడం వలన మనుషులు ఉండే నివాసాల్లోకి వచ్చేసాయి.

గుడుల దగ్గర కొబ్బరి చిప్పలు, ప్రసాదాలు తీసుకుని తినే కోతులకు గుడులు మూత పడడంతో ఆహారం దొరకకుడా ఆకలికి అలమటిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి గమనించిన కొంత మంది జంతు ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు మూగ జీవాలకు ఆహారం సరఫరా చేస్తూ ఆదుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ ఆలయం ట్రస్టీలు ప్రతి రోజు పశుపక్షల ఆకలిని తీరుస్తున్నారు. అలాగే మూగ జీవాలకు ఆహారం అందజేస్తున్న గ్రీన్ మెర్సి సంస్థకు శ్రీకాకుళంలో జిల్లా కలెక్టర్ రూ.లక్ష డొనేషన్ ఇచ్చారు. ఇక దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండడంతో ప్రజలెవరూ రోడ్లపైకి రాకపోవడంతో జంతువులు బాహాటంగా రోడ్లు, ఇళ్లలోకి వస్తున్నాయి.





Tags:    

Similar News