Viral Video: ఎంత పనైంది బ్రో.. పెళ్లి వేడుకలో ఊహించని పరిణామం..!
Viral Video: జీవితంలో పెళ్లి అనేది ప్రతీ ఒక్కరికీ ప్రత్యేకమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Viral Video: జీవితంలో పెళ్లి అనేది ప్రతి ఒక్కరికి ప్రత్యేకమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఎవరి స్థాయికి తగ్గట్లుగా వారు వివాహాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని భావిస్తారు. ఆ దిశగా ఆలోచిస్తుంటారు కూడా. జీవితంలో ఒకేసారి జరుపుకోవాలని కోరుకునే వేడుకను జీవితాంతం గుర్తిండిపోయేలా నిర్వహించుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ వేడుకల్లో చేదు అనుభవాలు ఎదురవుతాయి.
కానీ పెళ్లి వేడుకలో ఎదురైన ఆ చేదు అనుభవాలు కూడా... కాలంతో పాటు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతుంటాయి. తాజాగా ఇలాంటి ఓ సంఘటనకు సంబంధించి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివాహ వేడుకల్లో సంతోషంగా గడుపుతోన్న ఓ వరుడికి ఊహించని షాక్ ఎదురైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందనేగా మీ సందేహం.
నవ వధువులు ఇద్దరి పెళ్లి కార్యం పూర్తయిన తర్వాత డ్యాన్స్ ఫ్లోర్ పైకి చేరారు. వివాహానికి వచ్చిన అతధుల ముందు మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే వరుడు, వధువును పైకెత్తే ప్రయత్నం చేశాడు. అయితే అంతలోనే వరుడి ప్యాంట్ ఒక్కసారిగా పర్రుమని చినిగిపోయింది. అయితే తొలుత వరుడు ఈ విషయాన్ని గమనించలేదు. అయితే అది చూసిన వదువు ఒక్కసారిగా నవ్వేసింది.
దీంతో అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు స్టేజ్‌పైకి వచ్చి వరుడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఇదిలాఉంటే.. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు అయ్యో పాపం అంటుంటే, మరికొందరు మాత్రం నో ప్రాబ్లమ్ బ్రో.. ఇది కూడా ఒక స్వీట్ మెమోరీగా మిగిలిపోతుందని కామెంట్స్ చేస్తున్నారు.