Benefits of Baking Soda: నీళ్లలో బేకింగ్ సోడా కలిపి తాగితే..
Benefits of Baking Soda: బేకింగ్ సోడా.. అందరూ వంటింట్లో వాడుతుంటారు. అయితే బేకింగ్ సోడా మన చర్మ సౌందర్యాన్ని రక్షించడంలో కూడ ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు ఆరోగ్యనిపుణులు. బేకింగ్ సోడాలో ఉండే రసాయన లక్షణాలు చర్మాన్ని వ్యాధుల భారీనుండి రక్షిస్తుందంటున్నారు.
బేకింగ్ సోడా.. అందరూ వంటింట్లో వాడుతుంటారు. అయితే బేకింగ్ సోడా మన చర్మ సౌందర్యాన్ని రక్షించడంలో కూడ ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు ఆరోగ్యనిపుణులు. బేకింగ్ సోడాలో ఉండే రసాయన లక్షణాలు చర్మాన్ని వ్యాధుల భారీనుండి రక్షిస్తుందంటున్నారు.
Benefits of Baking Soda:
*బేకింగ్ సోడాని, నీటిలో కలిపి పేస్ట్ లా చేసుకుని ముఖానికి పట్టించి 5 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటి తో శుబ్రం చేసుకుంటే చర్మం కాంతి వంతంగా అవుతుంది.
* 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా మరియు 2 టేబుల్ స్పూన్లు ఓట్స్(oats) తీసుకుని నీటిలో కలిపి పేస్ట్ లా చేసుకుని ముఖానికి పట్టించి కాసేపటి తరువాత శుభ్రం చేసుకుంటే.. చర్మం మృదువుగా తయారవుతుంది.
* అరికాళ్లు పగుళ్ళతో బాధపడుతుంటే.. కొంచెం బేకింగ్ సోడాని గోరు వెచ్చని నీటీతో కలిపి ఒక 30 నిమిషాలు.. కాళ్లని నీటిలో ఉంచి, తరువాత శుభ్రం చేసుకోవాలి.. ఈ పద్దతి వల్ల కొత్త చర్మ కణాలు పుడతాయి.. అందువల్ల అరికాళ్ళ పగుళ్ళనుండి విముక్తి లబిస్తుంది.
* బేకింగ్ సోడాని స్నానం చేసే తొట్టెలో కాని, నీటిలో కాని వేసి ఒక 30 నిమిషాలు పాటు ఆ తొట్టెలో స్నానం చేస్తే మీ శరీరంలోని చనిపొయిన కణాలు తొలగిపోయి.. కొత్త కణాలు వస్తాయి.. అవి మీ శరీరంలో దుర్వాసనను నశింపజేస.. శరీరాన్ని తాజాగా ఉంచ్చుతుంది.
* సూర్యుని కాంతి వల్ల, కందిపొయినా, దురద వస్తున్నా, చిరాకు కలిగిస్తున్న శరీర సంరక్షణ కోసం.. ఒక చిన్న కప్పులో బేకింగ్ సోడాని కొంచెం నీటితో కలిపి చర్మానికి రాస్తే శరీరం చల్లబడుతుంది.
*చేతి గోళ్ళు మరియు వాటి చిగుళ్ళ సంరక్షణలో కూడా ఈ బేకింగ్ సోడాని ఉపయోగపడుతుది.. దీనికోసం ఏంచేయాలంటే.. బేకింగ్ సోడాని.. నీటిని 2:1 నిష్పత్తిలో కలిపి, కాటన్, లేదా బ్రష్ తో మీ గోళ్ళ పై, వాటి చిగుళ్లపై రాయలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మిల మిల మేరిసే గోళ్ళతో పాటు మృదువైన చిగుళ్ళు లభిస్తాయి.
*నల్ల మచ్చలు, మొటిమల వల్ల బాదపడేవారికి, కొంచెం బేకింగ్ సోడాని నీటితో కలిపి ముఖానికి పట్టించాలి. ఇలా వారానికి ఒక్క సారి చేయటం వల్ల మంచి కాంతివంతమైన చర్మంతో పాటు, నల్ల మచ్చలు, మోటిమలు తోలగిపోతాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
* పావు గ్లాసు నీళ్లలో, ఒక టీ స్పూను బేకింగ్ సోడా కలిపి రోజూ క్రమం తప్పకుండా తాగుతూ ఉంటే.. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో అడ్డంకులు తొలిగిపోతాయి అంటున్నారు నిపుణులు.
* చుండ్రు సమస్యలకు చెక్ పెట్టాలంటే.. నిమ్మరసంలో బేకింగ్ సోడా కలిపి, తలకు పట్టించి మర్దన చేయాలి. గంట తర్వాత ఎక్కువ నీళ్లతో తల స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే, చుండ్రు సమస్యలు దరిచేరవంటున్నారు ఆరోగ్య నిపుణులు.