Strange Railway Station: దేశంలోనే విచిత్రమైన రైల్వే స్టేషన్.. 1వ నంబర్ ప్లాట్‌ఫారమ్‌కు వెళ్లాలంటే ట్యాక్సీ ఎక్కాల్సిందే..!

Indian Railways: ఇక్కడ ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 నుంచి ప్లాట్‌ఫారమ్ నంబర్ 2కి వెళ్లడానికి రిక్షా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండు ప్లాట్‌ఫారమ్‌ల మధ్య దూరం 2 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్‌లో నంబర్ 1 ప్లాట్‌ఫారమ్ లేకపోవడం విశేషం.

Update: 2023-09-10 05:10 GMT

Strange Railway Station: దేశంలోనే విచిత్రమైన రైల్వే స్టేషన్.. 1వ నంబర్ ప్లాట్‌ఫారమ్‌కు వెళ్లాలంటే ట్యాక్సీ ఎక్కాల్సిందే..!

Barauni Railway Station: భారతదేశంలో రైల్వేల పెద్ద నెట్‌వర్క్ ఉంది. భారతదేశంలో చిన్న పట్టణాలకు వరకు రైల్వే లైన్లు వేశారు. అయితే భారతదేశంలోని ఒక రైల్వే స్టేషన్ ఉందని మీకు తెలుసా? ఇక్కడ ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 నుంచి ప్లాట్‌ఫారమ్ నంబర్ 2కి వెళ్లడానికి రిక్షా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండు ప్లాట్‌ఫారమ్‌ల మధ్య దూరం 2 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్‌లో నంబర్ 1 ప్లాట్‌ఫారమ్ కూడా లేకపోవడం విశేషం. ఈ వింత స్టేషన్ గురించి తెలుసుకుందాం..

ప్లాట్‌ఫారమ్ మారడానికి రిక్షా ఎక్కాల్సి ఉంటుంది..

ఈ స్టేషన్ బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో ఉంది. ఈ రైల్వే స్టేషన్ పేరు బరౌని. ఆశ్చర్యకరంగా, ఈ స్టేషన్‌లోని రైళ్లు ప్లాట్‌ఫారమ్ నంబర్ 2 నుంచి 9 వరకు మాత్రమే ఉంటాయి. ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 కోసం ఎప్పుడూ ఎటువంటి ప్రకటన ఉండదు. ఈ స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 నుంచి కాకుండా 2 నుంచి ప్రారంభమవుతుంది. ఎవరైనా ప్లాట్‌ఫారమ్ నంబర్ 1కి వెళ్లాలంటే రిక్షా ఎక్కాల్సి ఉంటుంది. దీనికి కారణం కూడా ఆసక్తికరంగా ఉంటుంది.

స్టేషన్‌లో ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 ఎందుకు లేదంటే?

బరౌని స్టేషన్‌లో ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 ఎందుకు లేదని ముందుగా తెలుసుకుందాం. నిజానికి, బరౌని రైల్వే స్టేషన్ 1833లో నిర్మించారు. అప్పట్లో ఒక ప్లాట్ ఫాం మాత్రమే నిర్మించారు. ఇది గూడ్స్ రైళ్లకు ఎక్కువగా ఉపయోగించేవారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. స్టేషన్‌ను విస్తరింపజేయవచ్చు. కానీ స్థలం తక్కువగా ఉంది. దీని కోసం ఈ స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఒక కొత్త స్టేషన్ నిర్మించారు. దీనికి బరౌని అని కూడా పేరు పెట్టారు. కానీ, అక్కడి స్టేషన్‌లో ప్లాట్‌ఫాం నంబర్ 1 నిర్మించలేదు. ఇది ప్లాట్‌ఫారమ్ నంబర్ 2 నుంచి మొదలవుతుంది.

భారతదేశంలోని ఏకైక స్టేషన్..

భారతదేశంలో ప్లాట్‌ఫారమ్ నంబర్లు 2 నుంచి ప్రారంభమైన ఏకైక స్టేషన్ బరౌని రైల్వే స్టేషన్ కావడం గమనార్హం. అయితే, ఇప్పుడు ప్లాట్‌ఫారమ్ నంబర్ మార్చనున్నారు. ఇంతకుముందు ఈ రైల్వే స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫారమ్‌లు ఉండేవి. ఇప్పుడు ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి, ఇప్పుడు 8కి తగ్గించనున్నారు. అదే సమయంలో 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 కలిగిన రైల్వే స్టేషన్‌కు న్యూ బరౌని అని పేరు పెట్టనున్నారు.

Tags:    

Similar News