Rent House: ఇల్లు అద్దెకి తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తప్పకుండా గమనించండి..!
Rent House: 'ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు' అన్నారు పెద్దలు. ఇందులో భాగంగానే కొంతమంది పైసా పైసా కూడేసి ఎంతో కష్టపడి ఇల్లు కడుతారు.
Rent House: 'ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు' అన్నారు పెద్దలు. ఇందులో భాగంగానే కొంతమంది పైసా పైసా కూడేసి ఎంతో కష్టపడి ఇల్లు కడుతారు. కానీ వాస్తు నియమాలు పాటించరు. దీనివల్ల అన్ని అనర్థాలే జరుగుతుంటాయి. అదేవిధంగా చాలామంది పట్టణాలు, నగరాల్లో ఇల్లు అద్దెకి తీసుకుంటారు. వీరు కూడా వాస్తు నియమాలు పాటించరు. దీనివల్ల జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.
ఇల్లు నిర్మించుకునేటప్పుడే కాదు ఇల్లు అద్దెకు తీసుకున్నా వాస్తుపరంగా జాగ్రత్తలు చూడాలి. నేటి కాలంలో వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే ప్రజలు కూడా వాస్తును నమ్ముతున్నారు. ఇల్లు వాస్తు ప్రకారం ఉంటే సంతోషం, శ్రేయస్సు ఇంట్లో ఉంటాయి. ఎక్కువగా విద్యార్థులు, పెళ్లి కాని అబ్బాయిలు అద్దె ఇళ్లలో ఉంటారు. వీరు వేటిని పట్టించుకోరు. కానీ వాస్తును పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
విద్యార్థులు ఎప్పుడూ తూర్పు,ఉత్తర గృహాలను మాత్రమే అద్దెకి తీసుకోవాలి. తూర్పు నుంచి ఉత్తరానికి, ఉత్తరం నుంచి తూర్పునకు నడిచే విధంగా ఉండాలి. ఇంటిని రెంట్‌కు తీసుకునేటప్పుడు ఆ ఇంట్లో గాలి వెలుతురు వస్తున్నాయా లేదా అని చూడాలి. వెంటిలేషన్ సమృద్ధిగా ఉండే గృహాన్ని ఎంచుకుంటే చదువుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. లిఫ్ట్ ఎదురుగా, మెట్ల ఎదురుగా ఉన్న ఇంటిని ఎంచుకోవద్దు. ముఖ్యంగా నైరుతి భాగాన్ని తాకుతూ కిందకు వెళ్లే మెట్లు, లిఫ్ట్ ఉన్న ఇంటిని తీసుకోకపోవడమే బెటర్. శ్మశానానికి చేరువలోని ఇంటిని రెంట్‌కు తీసుకుని అవస్థలు పడొద్దు. గృహానికి ఎదురుగా గుబురు పొదలు ఉండే గృహాన్ని తీసుకోకపోవడమే ఉత్తమం.