Spy Devices: హోటల్‌లో రూమ్ బుక్ చేస్తున్నారా.. ఈ పరికరాలు కనిపిస్తే జాగ్రత్త..!
Spy Devices: మనం కొన్ని పనుల కోసం పట్టణాలకు, నగరాలకు వెళ్లినప్పుడు అక్కడే ఓ రెండు, మూడు రోజులు ఉండాల్సిన పరిస్థితులు నెలకొంటాయి.
Spy Devices: మనం కొన్ని పనుల కోసం పట్టణాలకు, నగరాలకు వెళ్లినప్పుడు అక్కడే ఓ రెండు, మూడు రోజులు ఉండాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. ఇలాంటి సందర్భంలో హోటల్, లాడ్జిలో రూమ్ బుక్ చేసుకొని అక్కడే ఉంటాం. ముఖ్యంగా ఫ్యామిలీతో వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పెరిగిన టెక్నాలజీని కొంతమంది దుర్వినియోగం చేసి మీరు ఉండే గదుల్లో స్పై పరికరాలు అమరుస్తున్నారు. మీ వ్యక్తిగత జీవితాన్ని రికార్డ్ చేస్తున్నారు. తర్వాత బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్నారు. అందుకే హోటల్, లాడ్జిలకు వెళ్లినప్పుడు అక్కడ ఉండే ఇలాంటి వస్తువులను జాగ్రత్తగా గమనించండి.
కొన్ని హోటల్ గదుల్లో ప్రత్యేకమైన లైట్లు, బల్బ్‌లు ఉంటాయి. ఇందులో మిమ్మల్ని రికార్డ్ చేసే రహస్య కెమెరాలను అమర్చుతారు. మీ వాయిస్‌ని కూడా రికార్డ్ చేయవచ్చు. కొన్ని టెలివిజన్‌లు రికార్డ్ చేసే కెమెరాలను కలిగి ఉంటాయి. మీరు టీవీని ఆఫ్ చేసిన తర్వాత కూడా దాని పవర్ లైట్ ఆన్‌లో ఉంటే జాగ్రత్తగా ఉండండి. అందులో కెమెరా ఉండే అవకాశాలు ఉన్నాయి.
కొన్ని గడియారాలు, రేడియోలు మిమ్మల్ని రికార్డ్ చేయగల కెమెరాలను కలిగి ఉంటాయి. ఈ రహస్య కెమెరాలతో కూడిన ఇలాంటి రేడియో గడియారాలు మార్కెట్‌లో బోలెడు ఉన్నాయి. ఇవి కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పవర్ అవుట్‌లెట్‌లు మిమ్మల్ని రికార్డ్ చేయగల రహస్య కెమెరాలను కలిగి ఉంటాయి. మీరు హోటల్ గదిలోకి ప్రవేశించినప్పుడల్లా ముందుగా మీరు పవర్ అవుట్‌లెట్‌ను క్షుణ్ణంగా చెక్ చేయాలి. మీరు హోటల్ గదిలో స్మోక్ డిటెక్టర్‌ని చూస్తారు. ఇది పైకప్పుపై అమర్చబడిన సరళంగా కనిపించే పరికరం. కానీ కొన్నిసార్లు దీనిని కెమెరాను దాచడానికి ఉపయోగిస్తారని గుర్తుపెట్టుకోండి.