Social Media Addicted: ఈ లక్షణాలు కనిపిస్తే సోషల్​ మీడియాకు అడిక్ట్​ అయినట్లే..!

ఓ సర్వే ప్రకారం సోషల్ మీడియాలో కంటిన్యూగా 3 గంటలు గడిపే టీనేజర్లలో యాంగ్జైటీ, కోపం, నిరాశ వంటి సమస్యలు ఎదురవుతున్నాయని తెలిసింది.

Update: 2024-06-03 09:13 GMT

Social Media Addicted: ఈ లక్షణాలు కనిపిస్తే సోషల్​ మీడియాకు అడిక్ట్​ అయినట్లే..!

Social Media Addicted: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్​ ఫోన్​ ఉంటుంది. అందులో ఫేస్​ బుక్​, ఇన్​ స్టాగ్రామ్​, ట్విట్టర్​ లాంటి సోషల్​ మీడియా ప్లాట్​ ఫామ్స్​ ఉంటున్నాయి. ఇంకేముంది చాలామంది గంటల తరబడి అందులోనే లీనమై బతుకుతున్నారు. సెల్​ సౌండ్​ అయిందంటే చాలు నా ఫొటోకు లైక్​ కొట్టారా, నా వీడియోకి కామెంట్​ చేశారా అంటూ తరచుగా ఫోన్​ చూస్తూ ఉంటున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ దీనికి అడిక్ట్ అయిపోయారు. తినకుండానైనా ఉండగలుగుతున్నారు కానీ స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా లేకుండా ఉండలేక పోతున్నారు. దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయో ఈ రోజు తెలుసుకుందాం.

ఓ సర్వే ప్రకారం సోషల్ మీడియాలో కంటిన్యూగా 3 గంటలు గడిపే టీనేజర్లలో యాంగ్జైటీ, కోపం, నిరాశ వంటి సమస్యలు ఎదురవుతున్నాయని తెలిసింది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే మనిషికి కంటినిండా నిద్ర అనేది చాలా అవసరం. ఇది బాడీని రిచార్జ్​ చేస్తుంది. హుషారుగా పనిచేసుకోవడానికి సహకరిస్తుంది. సోషల్ మీడియాకి బానిసైపోవడం వల్ల రాత్రిపూట ఎవరూ సరిగ్గా నిద్రపోవడం లేదని సర్వేలో వెల్లడైంది. చాలామంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నట్లు బయటపడింది.

ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు వారు సోషల్ మీడియాని అంటిపెట్టుకుని ఒకేచోట గంటలు గంటలు గడిపేవారు ఉన్నారు. ఒకే చోట కూర్చొని లేదా పడుకొని వీడియోలు చూడటం వల్ల విపరీతంగా బరువు పెరిగిపోయి, ఊబకాయం భారినపడే అవకాశాలు ఉన్నాయి. ఇది కాకుండా సోషల్ మీడియా వల్ల యూత్ తమ విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. ఏ పని మీద ఏకాగ్రత పెట్టకపోవడం వల్ల కొత్తగా ఏదీ నేర్చుకోలేకపోతున్నారు. కెరియర్​ లో మిగతావారితో పోలిస్తే వెనుకబడుతున్నారు. అందుకే సోషల్​ మీడియాకి ఎంత దూరం ఉంటే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

Tags:    

Similar News