రూపాయి ఇడ్లీ మామ్మకు ఆనంద్ మహీంద్రా పెద్ద చేయూత!

రూపాయికే ఇడ్లీ అందిస్తున్న తమిళనాడుకు చెందిన ఓ బామ్మగారికి కార్పోరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా వంట గ్యాస్ ఉచితంగా అందిస్తానని ప్రకటించారు. భారత్ పెట్రోలియం కంపెనీ ఆమెకు గ్యాస్ సిలెండర్, స్టవ్ ఉచితంగా అందించింది.

Update: 2019-09-12 07:57 GMT

సోషల్ మీడియాను మంచిగా ఉపయోగించుకుంటే ఎంత ఉపయోగపడుతుందో చెప్పే సంఘటన ఇది. మంచి పని చేసుకుంటూ పొతే.. దానికి తగిన సహాయం.. గుర్తింపు కచ్చితంగా లభిస్తాయి. ఇంకా ఇలాంటి ఎన్నో విశేషాల్ని రూపాయి ఇడ్లీ మామ్మ రుజువు చేసింది. రూపాయి మామ్మ గురించి మీరు విన్నారు కదా.. మేము కూడా ఆమె కథనం మీకోసం అందించాం. అయినా మళ్లీ ఆ కథ ఓసారి..

తమిళనాడుకు చెందిన ఓ మామ్మ. పేరు కమలాత్తళ్. ఈ బామ్మ రూపాయికే ఒక ఇడ్లీ ఇస్తూ ఎందరి ఆకలినో తీరుస్తోంది. కొన్నేళ్లుగా ఇలానే ఆమె చేస్తోంది. ఆమె ఒక్కరే ఇడ్లీ చేయడం.. అడిగిన వారికి పెట్టడం.. ఇలా వన్ ఉమన్ ఆర్మీలా పేదల ఆకలి తీరుస్తూ వస్తోంది. ఈ విషయాన్ని ఎవరో ఈ మధ్య సోషల్ మీడియాలో పంచుకున్నారు. అంతే! అది వైరల్ అయింది. తరువాత ఎన్నో కథనాలు ఈ విషయంపై వచ్చాయి. ఇవన్నీ ఎవరికీ చేరాలో వారికి చేరాయి కూడా.

ఈ కథనం చదవండి: ఆకలి తీర్చే మాతృమూర్తులు ....

ఆనంద్ మహీంద్ర పేరు తెలీని వారుండరు. మహీంద్రా గ్రూప్ అధినేత. ఈయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఈయన సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తారు. అవసరమైన వారికి సహాయమూ అందిస్తారు. ఈ క్రమంలో రూపాయి ఇడ్లీ బామ్మ కు సంబంధించిన వివరాలు ఈయనకు అందాయి. వెంటనే అయన దీనిపై ఓ ట్వీట్ చేశారు. ఈ బామ్మ ఎందరికో ఆదర్శం. ఆ బామ్మ వ్యాపారంలో నేనూ భాగస్వామిని అవుతాను. ఎల్పీజీ గ్యాస్ పెట్టుబడిగా పెడతాను అంటూ ట్వీట్ చేశారు. దానికి చాలా మంది రియాక్ట్ అయ్యారు. అయ్యా.. గ్రామాల్లో కట్టెలు ఉచితంగా దొరుకుతాయి. దానితో ఆమె అందరి ఆకలి తీర్చగాలుగుతోంది. ఇప్పుడు మీరు గ్యాస్ ఇస్తే దానిని రీపిల్ చేసుకోవడానికి చాలా ఖర్చు అవుతుంది ఆలోచించారా? అంటూ ఆయనను ప్రశ్నించారు. దానికి వెంటనే స్పందించిన ఆనంద్ ఆమెకు గ్యాస్ తమ సంస్థ తరపున ఉచితంగా అందిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ కథనం భారత్ గ్యాస్ కంపెనీకి చేరింది. మహీంద్రా జీ మేము గ్యాస్ కనెక్షన్ ఆమెకు ఉచితంగా ఇస్తాం అని చెప్పడమే కాకుండా గ్యాస్ స్టవ్, సిలెండర్ తీసుకెళ్ళి ఆమెకి అందించి.. ఆ ఫోటో అందాన్ మహీంద్రా కు ట్వీట్ చేశారు. ఈయనా ఊరుకోరుగా వెంటనే.. ఆమె ఇడ్లీలకు అయ్యే వంటగ్యాస్ ఖర్చు మొత్తం నాదే అంటూ .. గ్యాస్ ఉచితంగా అందచేసినందుకు భారత్ గ్యాస్ కంపెనీని అభినందించారు. అదండీ విషయం. పాపం కట్టెల పొగతో ఇడ్లీ చేసి.. అందరికీ ఆకలి తీరుస్తూ ఉన్న ఈ బామ్మ గారికి ఇప్పుడు కష్టాలు తీరాయి. ఆమె మరింత మందికి ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇడ్లీలు ఆ తక్కువ ధరతోనే అందించాగాలుగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇంకో విషయం ఏమిటంటే. ఈమె మొన్నటి వరకూ ఇడ్లీ అర్థ రూపాయకే ఇచ్చేది. అర్థరూపాయి నాణేలు చెల్లుబాటులో లేకపోవడంతో ఆమె రూపాయికి ఓ ఇడ్లీ ఇస్తున్నారట. అన్నట్టు ఆమె దగ్గర ఇడ్లీ తినడానికి రెండు కిలోమీటర్ల దూరం నుంచి కూడా వస్తారు. ఏదిఏమైనా బామ్మ గారి సేవకు ఆనంద్ మహీంద్రా వంటి కార్పోరేట్ దిగ్గజం స్పందించడం నిజంగా అభినందనీయం.





Tags:    

Similar News