Amrit Bharat Express: సిద్ధమైన 'అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్' రైళ్లు.. ఇతర రైళ్ల కంటే ఛార్జీలు తక్కువా లేదా ఖరీదైనవా? పూర్తి వివరాలు ఇవే..!
Amrit Bharat Express News: 'అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్' రైళ్లలో 1 కిలోమీటరు నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉన్న గమ్యస్థానాలకు కనీస ఛార్జీ రూ.35గా ఉండనుంది.
Amrit Bharat Express News: 'అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్' రైళ్లలో 1 కిలోమీటరు నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉన్న గమ్యస్థానాలకు కనీస ఛార్జీ రూ.35గా ఉండనుంది. ఇందులో రిజర్వేషన్ ఫీజు, ఇతర ఛార్జీలు ఉండవని రైల్వే బోర్డు తెలిపింది. అమృత్ భారత్ రైళ్ల ఛార్జీలకు సంబంధించి బోర్డు అన్ని జోన్‌లకు తెలియజేస్తూ ఒక లేఖను విడుదల చేసింది. సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ ప్రయాణీకుల టిక్కెట్ ధరలతో కూడిన "ఫేర్ టేబుల్"ని జత చేసింది.
డిసెంబర్ 30న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నుంచి తొలి అమృత్ భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ రైలులో సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ కోచ్‌లు మాత్రమే ఉన్నాయి. ఎయిర్ కండిషన్డ్ తరగతికి సంబంధించిన ఛార్జీల పట్టికను రైల్వే మంత్రిత్వ శాఖ ఇంకా ఖరారు చేయలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం నడుస్తున్న ఇతర మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లతో సెకండ్, స్లీపర్ - ఈ రెండు తరగతుల ఛార్జీలను పోల్చి చూస్తే, అమృత్ భారత్ ఛార్జీలు 15 నుంచి 17 శాతం ఎక్కువ అని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఇతర మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఒకటి నుంచి 50 కిలోమీటర్ల మధ్య గమ్యస్థానానికి తరగతి ప్రయాణం రూ. 30లు ఉండగా, రిజర్వేషన్ రుసుము, ఇతర ఛార్జీలు మినహాయించబడతాయి” అని పేర్కొంది. దీంతో అమృత్ భారత్ ఛార్జీలు దాదాపు 17 శాతం ఎక్కువగా ఉండనున్నట్లు తేలింది.
రాయితీ టిక్కెట్లు చెల్లవు..
ఈ సర్క్యులర్ ప్రకారం, ఈ రైళ్లలో రాయితీ టిక్కెట్లు ఆమోదించబడవు. "రైల్వే ఉద్యోగులకు ప్రివిలేజ్ పాస్, PTO (ప్రివిలేజ్ టికెట్ ఆర్డర్), డ్యూటీ పాస్ మొదలైన వాటి అర్హత మెయిల్/ఎక్స్‌ప్రెస్‌లో అర్హతతో సమానంగా ఉంటుంది" అని పేర్కొంది.
సర్క్యులర్ ప్రకారం, “ఎంపీలకు ఇచ్చే పాస్‌లు, ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలకు ఇచ్చే రైల్ ట్రావెల్ కూపన్‌లు (టీఆర్‌సీ), స్వాతంత్ర్య సమరయోధులకు జారీ చేసిన పాస్‌ల ఆధారంగా టిక్కెట్ల బుకింగ్ అనుమతించబడుతుంది. ఎందుకంటే వారికి పూర్తిగా రీయింబర్స్‌మెంట్ ఇవ్వబడుతుంది.” ‘రైల్వే బోర్డు అమృత్ భారత్ రైళ్లు, వాటి ఛార్జీలకు సంబంధించి సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేయాలని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (CRIS)ని అభ్యర్థించింది.