Women Safety Tips: మహిళలకు అలర్ట్.. రాత్రిపూట టాక్సీలో ట్రావెల్‌ చేస్తున్నారా..!

Women Safety Tips: ఈ రోజుల్లో మహిళలు మగవారితో పాటు అర్ధరాత్రి వరకు ఆఫీసుల్లో పనిచేస్తున్నారు.

Update: 2023-11-06 16:00 GMT

Women Safety Tips: మహిళలకు అలర్ట్.. రాత్రిపూట టాక్సీలో ట్రావెల్‌ చేస్తున్నారా..!

Women Safety Tips: ఈ రోజుల్లో మహిళలు మగవారితో పాటు అర్ధరాత్రి వరకు ఆఫీసుల్లో పనిచేస్తున్నారు. నగరాల్లో అర్దరాత్రి వరకు పనిచేసే ఉద్యోగాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ సంస్థల్లో అర్థరాత్రి వరకు పని జరుగుతుంది. ఇంతకుముందు రాత్రిపూట మగవాళ్లనే డ్యూటీకి పెట్టేవారు కానీ ఈ రోజుల్లో ఆడవాళ్లు కూడా ఆఫీస్‌లోనే లేట్‌ రాత్రుళ్లు పనిచేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితిలో రాత్రిపూట ఆఫీసు క్యాబ్ సౌకర్యం అందుబాటులో ఉండకపోవచ్చు. మీరు వ్యక్తిగత వాహనం లేదా టాక్సీని బుక్ చేసుకోవడం ద్వారా ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

తప్పనిసరిగా లొకేషన్‌ను షేర్‌ చేయాలి

క్యాబ్‌లో కూర్చున్న తర్వాత మీ లొకేషన్‌ను కుటుంబంలోని ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులకు కచ్చితంగా షేర్‌ చేయాలి. తద్వారా వారు మీ లొకేషన్‌ను ట్రాక్ చేయవచ్చు. మీ క్యాబ్ ఈ లోపు ఎక్కడైనా ఆగితే అప్పుడు వారు చెక్ చేస్తారు. దీనితో మీ కుటుంబానికి మీరెక్కడ ఉన్నారో పూర్తి సమాచారం తెలుస్తుంది. ప్రయాణంలో మీకు ఏదైనా సమస్య ఎదురైతే ఎమర్జెన్సీ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా వారికి తెలియజేయవచ్చు.

ఫోన్‌లో మాట్లాడండి

డ్రైవర్ సరిగ్గా నడపడం లేదని మీతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడని మీకు డౌట్ వస్తే వెంటనే మీ స్నేహితుడికి లేదా కుటుంబంలో ఎవరికైనా ఫోన్ చేసి చెప్పాలి. లేదా సైలెంట్‌గా మెస్సేజ్ చేయాలి. కారు నంబర్, డ్రైవర్ సమాచారాన్ని వారికి షేర్‌ చేయాలి.

ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేయండి

రాత్రిపూట ప్రయాణిస్తున్నప్పుడు ఫోన్ పూర్తిగా ఛార్జ్ చేయాలి. లేదా ఫోన్ బ్యాటరీ అయిపోకుండా ఉండాలంటే తప్పనిసరిగా పవర్ బ్యాంక్‌ని కలిగి ఉండాలి. బ్యాటరీ డెడ్ కానట్లయితే ఎలాంటి సమాచారం అయినా సులువుగా అందించవచ్చు.

క్యాబ్ నంబర్, డ్రైవర్ వివరాలు

మీరు ట్యాక్సీని బుక్ చేసినప్పుడల్లా వాహనం నంబర్‌ను ఖచ్చితంగా చెక్‌ చేయాలి. తద్వారా ఇబ్బంది ఏర్పడితే మీరు ఆలస్యం చేయకుండా వెంటనే ఎవరికైనా వివరాలను పంపవచ్చు. మీకు తెలిసిన మార్గం ద్వారా మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లమని డ్రైవర్‌ని అడగండి.

Tags:    

Similar News