కారు యజమానులకి అలర్ట్.. ఈ రంగులో పొగ బయటికి వస్తే అంతే సంగతులు..!
Alert Car Owners: కారు చాలా కాలం నడవాలంటే దాని మెయింటనెన్స్ చాలా ముఖ్యం.
Alert Car Owners: కారు చాలా కాలం నడవాలంటే దాని మెయింటనెన్స్ చాలా ముఖ్యం. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. వాస్తవానికి కారు కానీ బైక్ కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొన్ని రకాల సిగ్నల్స్ ఇస్తాయి. వాటిని గుర్తించి సరిచేసుకుంటే పర్వాలేదు లేదంటే ఖర్చు భారీగా అవుతుంది. అటువంటి సిగ్నల్స్‌లో కారు పొగ కూడా ఒకటి. వాహనం నుంచి వచ్చే పొగ దాని ఆరోగ్యం గురించి చెబుతుంది. పొగ రంగుని బట్టి సమస్యని తెలుసుకోవచ్చు. దాని గురించి తెలుసుకుందాం.
1. బ్లాక్ స్మోక్
మీ కారు నుంచి నలుపు రంగు పొగ వస్తే ఇంధనం లీక్ అవుతుందని అర్థం చేసుకోండి. ఇలాంటి సందర్భంలో వాహనం నుంచి వచ్చే పొగ నల్లగా ఉంటుంది. గాలి-ఇంధన నిష్పత్తిలో సమస్య ఏర్పడినప్పుడు ఇలా జరుగుతుంది. ఇది కాకుండా అరిగిపోయిన నాజిల్ కారణంగా ఇంధన ఇంజెక్టర్ లీకేజీ జరుగుతుంది. దీనివల్ల కూడా ఈ సమస్య సంభవిస్తుంది.
2. నీలిరంగు పొగ
చాలా సార్లు పాత వాహనాలు నీలి పొగను వెదజల్లుతాయి. ఈ రకమైన పొగ ఇంజిన్‌లో లోపం ఉందని చెబుతోంది. పిస్టన్ లేదా వాల్వ్ గైడ్ సీల్ దెబ్బతిన్న తర్వాత ఇటువంటి పొగ బయటకు వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వీలైనంత త్వరగా మెకానిక్‌కి చూపించి కారును సరిచేయడం మంచిది.
3. తెల్లటి పొగ
మీ కారు తెల్లటి పొగను విడుదల చేస్తుంటే అప్రమత్తంగా ఉండాలి. దాని కూలంట్ లీక్ అయినప్పుడు ఈ రకమైన పొగ వస్తుంది. కూలంట్ పని వాహనం ఇంజిన్ చల్లగా ఉంచడం. ఇది లీక్ అయితే కారు త్వరగా వేడెక్కుతుంది. ఇంజిన్ చెడిపోతుంది. కాబట్టి సమీపంలోని మెకానిక్ షాపునకి వెళ్లి సరిచేసుకోవాలి.