Viral Video:బ్రేక్ నొక్కాల్సింది యాక్సిలరేటర్ నొక్కింది, ప్రాణాలే పోయాయి.

వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రాకు చెందిన 23 ఏళ్ల శ్వేతా దీపక్ సుర్వాసే.. తన స్నేహితుడు సూరజ్ సంజౌ ములే (25)తో కలిసి సోమవారం ఔరంగాబాద్ నుంచి సులిభంజన్‌ హిల్స్‌కు కారులో వెళ్లారు.

Update: 2024-06-18 12:30 GMT

Viral Video:బ్రేక్ నొక్కాల్సింది యాక్సిలరేటర్ నొక్కింది, ప్రాణాలే పోయాయి.

Viral Video: సరైన శిక్షణ లేకుండా వాహనాలు నడపకూడదని అధికారులు చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల తమ ప్రాణాలతో పాటు తమతో ప్రయాణం చేస్తున్న ఇతరుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది. కొన్ని సందర్భాల్లో తెలిసో, తెలియకో చేసే పొరపాటు ప్రాణాలను బలి తీసుకుంటుంది. తాజాగా ఇలాంటి ఓ ఘటన మహారాష్ట్రాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రాకు చెందిన 23 ఏళ్ల శ్వేతా దీపక్ సుర్వాసే.. తన స్నేహితుడు సూరజ్ సంజౌ ములే (25)తో కలిసి సోమవారం ఔరంగాబాద్ నుంచి సులిభంజన్‌ హిల్స్‌కు కారులో వెళ్లారు. ఈ సమయంలో శ్వేతా కారు డ్రైవింగ్ చేస్తోంది. ఇదే సమయంలో సూరజ్‌ సంజౌ ములే ఆమెకు డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఫోన్‌లో వీడియో రికార్డ్‌ చేశాడు. ఇదే సమయంలో శ్వేత రివర్స్‌ గేర్‌ వేసి కారు డ్రైవ్‌ చేస్తోంది. అయితే తొలుత శ్వేత కారును నెమ్మదిగా నడిపించసాగింది. కానీ కారు నెమ్మదిగా వెళ్తూ ఒక్కసారిగా వేగం పుంజుకుంది.

దీంతో ఆమె స్నేహితుడు సూరజ్‌ స్లో చేయమని పదేపదే హెచ్చరించాడు. క్లచ్‌ నొక్కమని బిగ్గరగా అరిచాడు. అయితే శ్వేత కన్ఫ్యూజ్‌కు గురై క్లచ్‌ లేదా బ్రేక్‌ నొక్కడానికి బదులుగా యాక్సలేటర్‌ను నొక్కింది. దీంతో కారు వేగంతో కొండ అంచు వరకు చేరింది. అక్కడ ఎలాంటి సైడ్‌ వాల్‌ లేకపోవడంతో ఒక్కసారిగా 300 అడుగుల ఎత్తైనా కొండపై నుంచి కారు లోయలో పడింది. దీంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయిపోయింది. ఈ ఘటనలో శ్వేతా అక్కడికక్కడే మృతిచెందింది. సూరజ్‌ ఫోన్‌లో రికార్డ్‌ అయిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 


Tags:    

Similar News