A woman act of kindness has won hearts in Kerala: ఆమె చేసిన చిన్న సహాయం..పెద్ద గుర్తింపు!
A woman act of kindness has won hearts in Kerala: ఆమె చేసింది చిన్న సహాయం. అనుకోకుండా ఒకాయన్ వీడియో తీశారు. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం.
సహాయం.. దీనంత గొప్పపదం మరోటి ఉండదు. సాటి మనిషికి చేసే సహాయంలో దొరికే తృప్తి మరోటి ఉండదు. సమయానికి చేసే సహాయం చిన్నదే కావచ్చు.. ఒక్కోసారి అది అందరి మనస్సులో గొప్పగా నాటుకుపోతుంది. సహాయం పొందిన వారు పొందే ఆనందం కంటే ఆ అసహయానికి ముగ్దులయిన వారు ఇచ్చే గౌరవం చాలా గొప్పగా ఉంటుంది. అటువంటిదే ఒక సంఘటన కేరళ లో ఇటీవల జరిగింది. చాలా చిన్న సంఘటన కానీ,, వేలాది మంది మెప్పు పొందింది.
ఎన్డీటీవీ లో వచ్చిన కథనం ప్రకారం.. కేరళలో ఒక మహిళ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో ఒక మహిళ వెళుతున్న బస్సును పరిగెత్తుతూ ఆపుచేసి.. ఒక వ్యక్తిని బస్సులోకి ఎక్కించింది. ఆమె ఆ పని చేసింది ఒక అంధుడైన వృద్ధుని కోసం. ఆయన ఎక్కాల్సిన బస్సు ఎక్కలేకపోయారు. ఇంతలో ఒక మహిళ ఆ బస్సు వెనుక పరిగెత్తుతూ వెళ్లి బస్సు ఆపింది. తరువాత వెనక్కి వెళ్లి.. ఆ పెద్దాయన చేయి పట్టుకుని నడిపించుకుంటూ వచ్చి బస్సు ఎక్కించి వెనక్కి వెళ్ళిపోయింది. ఈ సంఘటన ఒక వ్యక్తీ వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే, ఈ వీడియో ఎక్కడిదో, ఆ మహిళ ఎవరో ఎవరికీ తెలీదు. అందరూ గుర్తించింది ఆమాత్రం ఆమె చేసిన సహాయం. ఆమె చేసిన ఆ పనికి అంతా ఫిదా అయిపోయారు. ఇక కేరళకు చెందిన మాతృభూమి న్యూస్ ఈ వీడియోలోని మహిళను గుర్తించింది. ఆమె పేరు సుప్రియ. ఈ సంఘటన తిరువల్ల లో జరిగింది.
ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే.. మనోరమ ఆన్లైన్ పత్రిక కథనం ప్రకారం ఈ వీడియో తీస్తున్నట్టు సుప్రియకు తెలియదు. ఈ సంఘటన జరుగుతున్నపుడు అక్కడ ఉన్న జాషువా అనే వ్యక్తీ అనుకోకుండా ఈ వీడియో తీశారు. అయన దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
సోషల్ మీడియాలో ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ వీడియోను అక్కడి ఐపీఎస్ అధికారి విజయకుమార్ తన ట్విట్టర్ లో బుధవారం షేర్ చేశారు. దీంతో ఈ వీడియో మరింత వైరల్ గా మారింది.
she made this world a better place to live.kindness is beautiful!😍
— Vijayakumar IPS (@vijaypnpa_ips) July 8, 2020
உலகம் அன்பான மனிதர்களால் அழகாகிறது#kindness #love pic.twitter.com/B2Nea2wKQ4