World's Longest Highway: 6 రాష్ట్రాలు, 14 దేశాలు.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారి.. జర్నీ చేయాలంటే నరకమే..!

Pan American Highway: ప్రతిరోజూ 500 కి.మీ. నడిస్తే.. ఈ రహదారిని పూర్తి చేసేందుకు దాదాపు 60 రోజుల సమయం పడుతుంది.

Update: 2023-06-01 04:19 GMT

Guinness Book of World Records: ప్రయాణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. గత కొన్ని సంవత్సరాలుగా, భారతదేశంలోని రోడ్లు చాలా మెరుగ్గా మారాయి. మంచి రోడ్లు అభివృద్ధి చెందిన దేశానికి చిహ్నంగా పరిగణిస్తుంటారు. రోడ్లు అధ్వానంగా ఉంటే నిమిషాల ప్రయాణం గంటలు అవుతుంది. భారతదేశంలోని పొడవైన రహదారిగా నేషనల్ హైవే 44 (NH-44) పేరుగాంచింది. ఈ 37,454 కిలోమీటర్ల పొడవైన హైవే కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు వెళుతుంది. అయితే, ఈ రోజు చెప్పబోయే రహదారి గురించి తెలుసుకుంటే మాత్రం.. అవాక్కవుతారంతే.. 5-6 రాష్ట్రాలను కవర్ చేస్తూ.. 14 దేశాల గుండా వెళ్తుంది.

ఈ రహదారి పేరు పాన్ అమెరికన్ హైవే. ఉత్తర అమెరికా నుంచి ప్రారంభమైన ఈ రహదారి 14 దేశాల గుండా పోతుంది. ఇది దక్షిణ అమెరికాలోని అర్జెంటీనాలో ముగుస్తుంది. దీని పొడవు కారణంగా, ఈ హైవే పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా నమోదు అయింది. ఈ హైవే గురించిన ప్రత్యేకతలను ఇప్పుడు తెలుసుకుందాం..

1923లో ఓ చిన్న ఆలోచనతో..

ఈ రహదారిని నిర్మించాలనే ఆలోచన 1923 సంవత్సరంలో వచ్చింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన, ప్రసిద్ధ రహదారిగా పేరుగాంచింది. దీని నిర్మాణంలో ఒకటి కాదు 14 దేశాల హస్తం ఉంది. ఈ దేశాలు- అర్జెంటీనా, కెనడా, చిలీ, కొలంబియా, ఎల్ సాల్వడార్, బొలీవియా, గ్వాటెమాల, హోండురాస్, మెక్సికో, యుఎస్, నికరాగ్వా, పనామా, కోస్టారికా పెరూ.

ఈ హైవే 30 వేల కిలోమీటర్ల వరకు కోత, మలుపు లేని విధంగా ఉండడం గమనార్హం. అయితే ఈ ప్రయాణం అంత ఈజీ కాదు. ఇందులో దాదాపు 110 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే మాత్రం దడ పుట్టాల్సిందే. డేరియన్ గ్యాప్‌లోని ఈ భాగంలో మాదకద్రవ్యాల రవాణా, కిడ్నాప్, స్మగ్లింగ్ జరుగుతాయి. మీరు ఈ హైవేలో బయలుదేరినప్పుడు, మంచు ప్రాంతం, దట్టమైన అడవి, ఎడారి ప్రాంతాల గుండా ప్రయాణం చేయాల్సిందే. దీన్ని పూర్తి చేయాలంటే మాత్రం చాలా నెలల సమయం పడుతుంది.

అంటే ప్రతిరోజూ 500 కిలోమీటర్ల చొప్పున నడిస్తే.. మొత్తం హైవేను కవర్ చేయడానికి దాదాపు 60 రోజులు పడుతుంది. కలోర్స్ శాంటామారియా అనే సైక్లిస్ట్ ఈ రహదారిని దాటడానికి 117 రోజులు పట్టింది. ఇప్పటికీ అతని పేరు గిన్నిస్ బుక్‌లో నమోదైంది.

నిపుణులు మాత్రమే డ్రైవింగ్ చేయగలరు..

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ రహదారికి ఒకే మార్గం మాత్రమే కాదు.. ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలను కలుపుకుంటే పొడవు 48000 కి.మీ.లు ఉంటుంది. దక్షిణ, ఉత్తర అమెరికా రెండు రాజధానుల మధ్య ప్రయాణిస్తున్నట్లయితే, అప్పుడు ఖచ్చితంగా ఈ రహదారిపైకి వస్తారని అంటారు.

ఈ రహదారిపై డ్రైవింగ్ చేయడం అంత సులభం కాదు. నిపుణులు మాత్రమే దీనిపై నడపగలరు. ప్రజలు దానిపై ప్రయాణించడానికి చాలా నెలలు సిద్ధ పడాల్సి ఉంటుంది. బైక్ లేదా కారులో ప్రయాణించే ముందు అన్ని రకాల ఉపకరణాలు దగ్గర ఉంచుకోవాలి. వాహనం పంక్చర్ అయినట్లయితే లేదా చెడిపోయినట్లయితే, ఈ రహదారిపై మెకానిక్ అందుబాటులోకి రావాలంటే మాత్రం చాలా కష్టపడాల్సిందే. 

Tags:    

Similar News