Six Factors more Effect to Corona: ఈ ఆరు ల‌క్ష‌ణాలుంటే... క‌రోనా ముప్పున్నటే.

Six Factors more Effect to Corona: క‌రోనా ... ఈ పేరు విన‌గానే ‌ప్ర‌పంచ దేశాలు గజగజ వణుకుతున్నాయి ఈ మహమ్మారి వ్యాప్తి ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా.. ఇంకా ఈ వ్యాధికి సంబంధించిన పూర్తి అవ‌గాహ‌న రాలేదు.

Update: 2020-07-22 10:42 GMT
Six Factors more Effect to Corona: ఈ  ఆరు ల‌క్ష‌ణాలుంటే...  క‌రోనా ముప్పున్నటే.
6 Factors Make You Much More Likely to Die From corona
  • whatsapp icon

Six Factors more Effect to Corona:  క‌రోనా ... ఈ పేరు విన‌గానే ‌ప్ర‌పంచ దేశాలు గజగజ వణుకుతున్నాయి ఈ మహమ్మారి వ్యాప్తి ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా.. ఇంకా ఈ వ్యాధికి సంబంధించిన పూర్తి అవ‌గాహ‌న రాలేదు. ఈ వైర‌స్ నుంచి మాన‌వ జాతిని ర‌క్షించేందుకు శాస్ర‌వేత్త‌లు విస్తృతంగా పరిశోధనలు కొనసాగుతున్నారు. కానీ.. మరోవైపు కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తూ.. తన జన్యు క్రమాన్ని కూడా మార్చుకుంటూ మరింత ప్రాణాంతకంగా మారుతోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ కరోనా కేసులు, మరణాలు భారీగా న‌మోదవుతున్నాయి. ఈ మహమ్మారి కట్టడి కోసం ఎన్ని చర్యలు చేపట్టినా తగ్గుముఖం పట్టడం లేదు. వ‌య‌స్సుతో సంబంధం లేకుండా అందరిలో సోకుతుంది. రిక‌వ‌రీ రేటు సానుకూలంగా ఉన్న‌ప్ప‌టికీ ... రోజురోజుకూ పెరుగుతున్న‌.. మ‌ర‌ణ రేటు మాత్రం భ‌యాందోళ‌ల‌కు గురి చేస్తుంది. కరోనా వైరస్ ఒక్కొక్కరిలో ఒక్కోలా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా మందుస్తు అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో కరోనా తీవ్రత ప్రాణాంతకంగా మారుతుంది. ఈ నేప‌థ్యంలోనే American Medical Association వారి అధ్య‌‌యనం కొన్ని విస్తుగొలిపే నిజాల‌ను వెలుగులోకి తెచ్చింది. *These 6 Factors Make You Much More Likely to Die From covid 19* అనే పేరుతో నివేదిక‌ను వెలువ‌రించింది.

ఈ అధ్య‌య‌నంలో భాగంగా అమెరికాలో మార్చి నుంచి ఏప్రిల్ వరకు 65 ఆస్పత్రుల్లో 2,215 మంది కరోనా రోగులను పరీక్షించారు. వైరస్ సోకిన వారిలో 875 మంది మరణించారు. కరోనాతో మరణించి వారిలో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో గుర్తించారు. కరోనాతో మరణ ముప్పుకు అందులో ఈ ఆరు ల‌క్ష‌ణాలు ఉన్న వారిలో వైర‌స్ విస్తృతి ఎక్కువ‌గా క‌నిపించింద‌ని తెలిపింది.

1. 60 ఏండ్లు దాటితే:

కరోనా వైరస్ ముప్పు ఎక్కువగా 60 ఏండ్లు దాటిన వారిలో ఎక్కువగా ఉంటుందని Journal of American Medical Association నివేదిక తెలిపింది. 60 ఏండ్లు దాటిన, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు కరోనావైరస్ కారణంగా మరణించడానికి మూడు రెట్లు అవకాశం ఉందని గుర్తించారు. 80 ఏండ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు వైరస్ బారిన పడే అవకాశం 11 రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు.

2. పురుషుల్లోనే ఎక్కువ‌:

ఈ స‌ర్వే ప్రకారం.. వైర‌స్ ఉధృతి మహిళల్లో కంటే పురుషుల్లోనే ప్రభావం ఎక్కువనే తేల్చేంది. అయితే కరోనా సోకిన పురుషుల్లో మరణించే అవకాశం 1.5 రెట్లు ఎక్కువగా గుర్తించారు. కొన్ని కొమొర్బిడిటీలు స్త్రీలలో కంటే పురుషులలో ఎక్కువగా ఉండటం వల్ల ఈ ముప్పు అధికంగా ఉంటుందని తేల్చేశారు.

3.స్థూలకాయం (ఊబకాయం) :

అధిక బరువు ఉన్నవారిలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. స్థూలకాయంతో బాధపడేవారిలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. రోగనిరోధక శక్తి కూడా బలహీన పడుతుంది. ఈ అధ్యయనం ప్రకారం.. 40 ఏండ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు‌లో BMI ఉన్నవారు, తీవ్రమైన ఊబకాయం ఉన్నవారు, వైరస్‌తో మరణించే అవకాశం 1.5 రెట్లు ఎక్కువని పరిశోధకులు తెలిపారు.

4. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారిలో :

గుండె సంబంధిత వ్యాధులు ఉన్న పేషెంట్లు (రక్తప్రసరణ గుండె ఆగిపోవడం, దీర్ఘకాలిక obstructive pulmonary వ్యాధితో సహా) కూడా క‌రోనాకు బ‌లైయే అవ‌కాశం 1.5 రెట్లు ఎక్కువగా ఉందని అధ్యయనం తెలిపింది. గుండె సంబంధిత వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారిలోనూ కరోనా ముప్పు అధికంగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు

5. క్యాన్సర్ వ్యాధి :

క్యాన్సర్ సంబంధింత సమస్యలు ఉన్నవారికి కరోనా వైరస్ సోకితే మరింత ప్రాణాంతకమని పరిశోధకులు అంటున్నారు. క్యాన్సర్ రోగులకు ఒకవేళ కరోనా సోకితే వైరస్ తో పోరాడటం చాలా కష్టమని అంటున్నారు. ఈ వైర‌స్ కారణంగా క్యాన్సర్ రోగులు చనిపోయే అవకాశం 2 రెట్లు ఎక్కువ అని అధ్యయనం సూచిస్తోంది.

6. వైద్య స‌దుపాయ‌ల కొర‌త (ఐసీయూ బెడ్్స‌):

ఇది వ్యక్తిగత అనారోగ్య సమస్య కాకపోవచ్చు.. కానీ, COVID-19 సోకిన రోగి ఆస్పత్రిలో చేరినప్పుడు ఐసీయూ పడకల కొరత అధికంగా ఉంటే మరణించే అవకాశం గణనీయంగా పెరిగిందని ఈ స‌ర్వే తెలింది. సరైన వైద్య సదుపాయాలు లేక.. సకాలంలో వైద్య సాయం అందక కూడా చాలామంది కరోనా రోగులు మరణించే అవకాశం ఉంటుందని నివేదిక వెల్లడించింది.

Tags:    

Similar News