ప్రతిభకు వయసు, డబ్బు, హోదా, అందం లాంటివి సంబంధంలేదని నిరూపించింది ఓ పెద్దావిడ.. తన గానంతో అందరిని మంత్రముగ్దుల్ని చేసింది. ఒక్కపాటతో ఇప్పుడు సోషల్ మీడియాలో తన స్వరాన్ని వినిపించి.. నెటిజన్లను ఫీదా చేసేసేంది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ పాడిన 'ఏక్ ప్యార్‌కి నగ్మా' పాటను పాడి తన గాన మాధుర్యంతో ఎందరో హృదయాలను హత్తుకున్నారు. 'బర్పెటా టౌన్ ద ప్లేస్' అనే ఫేస్ బుక్ పేజీ ఆమె టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది.
ఇక వివరాల్లోకి వెళితే రణఘాట్ రైల్వేస్టేషన్ ఉన్న పెద్దావిడా పాడిన ఏక్ ప్యార్‌కి నగ్మా' పాటను పాడి వీడియోను జులై 28న పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియో పట్టుమని 2నిమిషాల 11 సెకండ్లు మాత్రమే ఉంది. అంతే వీడియో చూసిన వారు ఫీదా అయిపోయారు. అచ్చుగుద్దినట్లు ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌గా పాడుతోందంటూ తెగ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఇప్పటి వరకు ఈ వీడియో 16 లక్షల వ్యూస్ సాధించింది. 35 వేల మందికి పైగా ఆమె వీడియోను షేర్ చేశారు. ఆ పెద్దావిడ పాడిన పాటను మళ్లీ మళ్లీ చూస్తూ..తెగ సంబరపడిపోతున్నారు. టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదని మరోసారి నిరూపించింది ఈ పెద్దావిడ. ఇక నెటిజన్లు అయితే పెద్దావిడ పాటకు అమ్మ నీకు వందనం.. నీ పాటకో వేల వేల వందనాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.