మూడు నాలుగు అడుగులు పొడవున్న పామును చూస్తేనే మన గుండెలు ఆగినంత పని అవుతుంది. మరి పద్నాలుగడుగుల తాచుపామును చూస్తే .. ఇంకేముంది పై ప్రాణాలు పైనే పోతాయి. సరిగ్గా అంతా పాము ఇటీవల కనిపించింది. అసోం లోని నాగోం జిల్లాలో 14 అడుగుల కింగ్ కోబ్రా కనిపించింది స్థానికులకు. అక్కడి జైజూరి టీ ఎస్టేట్ లో పని చేస్తున్న వారికి శుక్రవారం ఈ తాచుపాము కనిపించింది. వెంటనే వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారక్కడికి చేరుకొని దానిని పట్టుకున్నారు. తరువాత దానిని అక్కడకు దగ్గరలోని సువాంగ్ అభయారణ్యంలో వదిలి వేశారు.