గొర్రెను క్లోజ్ షాట్ తీద్దామనుకున్నాడు..కొమ్ములతో కుమ్మేసింది!
మన శరీరం భాగాలలో కొన్ని అత్యంత సున్నితంగా ఉంటాయి. ఇగ వాటికి ఏ మాత్రం దెబ్బ తగిలితే తట్టుకోలేం. గిల్ల గిల్ల కొట్టుకుంటాం. అలాంటి పరిస్థితి బీబీసీ కెమెరామేన్‌కి ఎదురైంది.
మన శరీరం భాగాలలో కొన్ని అత్యంత సున్నితంగా ఉంటాయి. ఇగ వాటికి ఏ మాత్రం దెబ్బ తగిలితే తట్టుకోలేం. గిల్ల గిల్ల కొట్టుకుంటాం. అలాంటి పరిస్థితి బీబీసీ కెమెరామేన్‌కి ఎదురైంది. దినికి సంబంధించిన వీడియోని బీబీసీ యూట్యూబ్‌లో పెట్టింది. ఆ వీడియో ఇద్దరు మహిళలు దగ్గరికి వచ్చిన గొర్రెకు మొతపెడుతుంటారు. ఆ తరువాత పక్కనే ఉన్న కెమెరామేన్ దగ్గరకు వెళ్లింది. ఆ సమయంలో అతడు కింద కూర్చొని ఉన్నాడు. ఆ గొర్రెను క్లోజ్ షాట్ తీద్దామని ఫిక్స్ అయ్యాడు. కానీ ఇంతలోనే ఆ గొర్రె అతనికి గట్టి షాట్ ఇచ్చింది. కరెక్టుగా సెన్సిటివ్ పార్ట్స్‌ను ఢీకొట్టడంతో కెమెరామేన్ ఒక్కసారిగా కంగుతిని బొర్ల బొక్కల పడ్డాడు.
లాంగ్లెస్ ఎస్టేట్ అండ్ సఫారీ పార్క్‌లో పరిశోధనలు చేస్తున్న సమయంలో... ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 2న అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 8 లక్షల మందికి పైగా చూశారు. చాలా మంది ఈ వీడియో చూసిన తరువాత కామెంట్స్ పెడుతున్నారు. మీ దగ్గర కెమెరా ఉంటే.. ఆ గొర్రెకు పదునైన కొమ్ములు ఉన్నాయి. ఎంత కోపం వచ్చిందో అందుకే అలా కుమ్ముడు కుమ్మింది' అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు ఇదో దురదృష్టకర సంఘటనగా వారు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.