COVID-19: కరోనాపై కేంద్రం అప్రమత్తం.. మళ్లీ మాస్కులు ధరించాలని సూచన

COVID-19: కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది.

Update: 2022-12-21 10:16 GMT

COVID-19: కరోనాపై కేంద్రం అప్రమత్తం.. మళ్లీ మాస్కులు ధరించాలని సూచన 

COVID-19: కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. తాజా పరిణామాలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ నిపుణులతో సమావేశమయ్యారు. విదేశాల్లో కరోనా విజృంభనతో కేంద్రం అలర్ట్ అయ్యింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామని సమావేశం అనంతరం కేంద్ర మంత్రి చెప్పారు. కొవిడ్ ఇంకా ముగియలేదని.. కొన్ని దేశాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 27 నుంచి 28 శాతం మంది మాత్రమే ప్రికాషనరీ డోస్ తీసుకున్నారని తెలిపారు. వృద్ధులు ప్రికాషనరీ డోస్ తప్పనిసరిగా తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.

ప్రికాషనరీ డోస్ అందరికీ సూచిస్తున్నామని తెలిపింది. రద్దీ ప్రాంతాల్లో మాస్క్ వేసుకుంటే మంచిదన్న కేంద్ర ఆరోగ్య శాఖ.. వృద్ధులైతే తప్పనిసరి సూచించింది. చైనా నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా దేశంలో కేసుల సంఖ్య పెరుగుదలను నివారించేందుకు ప్రత్యేకంగా కేంద్రం దృష్టిసారించింది. దేశంలో ప్రస్తుతం కరోనా భయపడే స్టేజ్‎లో లేదని.. తగిన పరీక్షలు నిర్వహిస్తున్నామని కొవిడ్ జాతీయ టాస్క్ ఫోర్స్‎కు నాయకత్వం వహిస్తున్న నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ వెల్లడించారు. అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు ప్రస్తుతం ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. కొవిడ్ పరిస్థితులను పర్యవేక్షించేందుకు వారానికి ఒకసారి సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.

Tags:    

Similar News