Viral Video: మెట్రోలో బరితెగించిన ప్రేమ జంట.. అందరి ముందే పాడు పని..

Metro Train: ప్రేమలో పడితే మనల్ని మనం మర్చిపోతామని, మన చుట్టూ ఉన్న ప్రపంచం అసలు కనిపించదని అంటారు.

Update: 2023-05-11 07:01 GMT

Viral Video: మెట్రోలో బరితెగించిన ప్రేమ జంట.. అందరి ముందే పాడు పని..

Metro Train: ప్రేమలో పడితే మనల్ని మనం మర్చిపోతామని, మన చుట్టూ ఉన్న ప్రపంచం అసలు కనిపించదని అంటారు..ఆ ప్రేమ జంటకు కూడా అదే జరిగింది..తమ చుట్టూ ఎంతో మంది ఉన్నారు..తమను గమనిస్తున్నారు..ఇలాంటి ఆలోచనే లేకుండా, చిన్నారులు ఉంటారు అనే ఇంగితం కూడా లేకుండా రాసలీలల్లో మునిగిపోయారు. ప్రేమికులు మైమరచిపోయే సన్నివేశలు సాధారణంగా పార్కుల్లో కనిపిస్తుంటాయి. అయితే పార్కులకు పరిమితం కాకుండా ఈ ప్రేమ పక్షులు మెట్రో ట్రైన్లనే తమ గూడుగా చేసుకొని రాసలీలలు సాగించడం కలవరపెడుతోంది.

ఢిల్లీ మెట్రోలో అందరూ చూస్తుండగానే ఓ జంట రెచ్చిపోయింది. ముద్దులు, హగ్గులతో రచ్చ చేసింది. పక్కనున్న వారు వీడియో తీసి షేర్ చేయడంతో ఈ అసభ్యత వెలుగుచూసింది. ఇది మరువక ముందే మరో జంట సిగ్గువిడిచి మెట్రోలోనే లిప్ కిస్ లు ఇచ్చుకోవడం చూసి ప్రయాణికులు అవాక్కయ్యారు. మెట్రో కోచ్ ఫ్లోర్ పై యువకుడు కూర్చోగా..యువతి అతడి కాలుపై తలపెట్టి కూర్చుంది. ఈ జంట అక్కడితో ఆగకుండా అందరూ చూస్తున్నారు అనే సంగతి మరిచి లిప్ లాక్ ముద్దులతో రెచ్చిపోయింది.

ఈ ప్రేమజంట వీడియోని చూసిన నెటిజన్స్ ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. ఢిల్లీ మెట్రో పేరును పోర్న్ హబ్ గా ఎందుకు మార్చకూడదని ఓ నెటజిన్ ప్రశ్నిస్తే...ఇలాంటి వారిని ప్రశ్నించకపోతే రైల్లోనే సంసారం చేస్తారంటూ కామెంట్స్ చేశారు. ఇక మరికొందరైతే అమ్మాయికి సీపీఆర్ ఇస్తూ ఆమె ప్రాణాలను నిలిపేందుకు అబ్బాయి చాలా కష్టపడుతున్నాడంటూ చమర్కాతం చేశారు. ఏదిఏమైనా, సీసీ కెమెరాలు ఉంటాయని తెలిసినా...పబ్లిక్ గా రెచ్చిపోతుండడంతో తోటి ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

అయితే.. వైరల్ అవుతున్న ఈ వీడియో ఢిల్లీ మెట్రోకి సంబంధించినదని పలు వార్తా కథనాలు వెలువడ్డాయి.. కానీ, hmtv మాత్రం దీనిని ధృవీకరించడం లేదు..


Tags:    

Similar News