కీలక నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీ..ఉక్రెయిన్ బోర్డ‌ర్ దేశాల‌కు న‌లుగురు కేంద్ర మంత్రులు..

Russia Ukraine War: ఉక్రెయిన్-రష్యా సంక్షోభంపై ప్రధాని మోడీ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశమయ్యారు.

Update: 2022-02-28 05:37 GMT

Russia Ukraine War: కీలక నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీ

Russia Ukraine War: ఉక్రెయిన్-రష్యా సంక్షోభంపై ప్రధాని మోడీ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశమయ్యారు. విద్యార్ధులు, పౌరుల తరలింపుల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై అధికారులతో మోడీ చర్చిస్తున్నారు. సరిహద్దుల్లో భారతీయ విద్యార్ధులపై జరిగిన దాడి విషయాన్ని అధికారులు మోడీ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు కేంద్ర మంత్రులు వెళ్లాలని ప్రధాని ఆదేశించారు. విద్యార్థుల తరలింపు ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించాలని మోడీ ఆదేశించారు.

మంత్రులు హ‌రిదీప్ సింగ్ పురి, జ్యోతిరాదిత్య సింథియా, కిర‌ణ్ రిజిజు, వీకే సింగ్‌లు.. భార‌తీయ విద్యార్థుల‌ను తీసుకువ‌చ్చేందుకు విదేశాల‌కు వెళ్ల‌నున్నారు. ఉక్రెయిన్‌లో ఇంకా దాదాపు 16వేల మంది భార‌తీయ విద్యార్థులు చిక్కుకున్న‌ట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News