Wayanad Landslides Causes: వయనాడ్ విలయం మానవ తప్పిదమే? మైనింగ్, అక్రమ కట్టడాలే కారణమా?

Wayanad Landslides Causes: వయనాడ్ విపత్తుకు అక్రమ కట్టడాలు, మైనింగ్ లే కారణమని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. హిమాలయాల మాదిరిగానే పశ్చిమ కనుమలు కూడా పెళుసుగా ఉండే ప్రాంతాలని తెలిపారు. ఈ ప్రాంతాల్లో విపత్తులను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Update: 2024-08-06 03:12 GMT

Wayanad Landslides Causes: వయనాడ్ విలయం మానవ తప్పిదమే? మైనింగ్, అక్రమ కట్టడాలే కారణమా?

Wayanad Landslides Causes:కేరళలోని వయనాడ్ ఘోర విలయం నుంచి ఇంకా కోలుకోలేదు. కొండచరియలు విరిగిపడి గ్రామాలకు గ్రామలే తుడిచిపెట్టుకుపోయాయి. వందలామంది ప్రాణాలు కోల్పోయారు. వయనాడ్ విలయానికి కారణం మానవ తప్పిదమే అంటున్నారు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్. పశ్చిమ కనుమల్లో పర్యావరణ సున్నిత ప్రాంతాలను గుర్తించే ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే దీనిపై తుది నిర్ణయానికి వస్తామని చెప్పారు.

పశ్చిమ కనుమల్లోని 56,800 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పర్యావరణ సున్నిత జోన్ గా ప్రకటించేందుకు 2014 నుంచి జులై 31 వరకు 6 సార్లు ముసాయిదా నోటిఫికేషన్లు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ రాష్ట్రాల అభ్యంతరాలతో తుది నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. దీనిపై చర్యలు జరుగుతున్నాయని..ఈ మధ్యలోనే కేరళలో అక్రమ నిర్మాణాలకు, మైనింగ్ అనుమతులు ఇచ్చినట్లు ఆరోపించారు. దీంతోనే వయనాడ్ ఘోరం జరిగిందన్నారు.

హిమాలయాల వలే పశ్చిమ కనుమలు కూడా పెళుసుగా ఉండే ప్రాంతాలని భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఈ ప్రాంతాల్లో విపత్తులను అడ్డుకునేందుకు భారీ ఎత్తున చర్యలు చేపట్టాల్సి ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేరళ ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉందన్నారు.

కాగా ముందస్తు హెచ్చరికలను కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదని కేంద్ర మంత్రి అమిత్ షా ఇటీవల పార్లమెంట్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఈ సంచలన వ్యాఖ్యలుచేశారు. అక్రమ జనావసాలకు స్థానిక రాజకీయవేత్ల రక్షణ ఉందన్నారు. కనీసం టూరిజం పేరుతో సరైన జోన్లను కూడా వాళ్లు ఏర్పాటు చేయలేదని విమర్శలు గుప్పించారు. ఈ ప్రాంతంలో భూకబ్జాలు జరిగాయన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం హైలీ సెన్సిటివ్ ఏరియా అని మంత్రి తెలిపారు. ఈ విషయాన్ని భూపేంద్ర యాదవ్ ట్విట్టర్ లో షేర్ చేశారు.

కాగా నౌఫాల్ అనే ఇంటియజామని 11 మంది కుటుంబ సభ్యులను వదిలి ఒమన్ వెళ్లారు. మూడు నెలలు తిరగక్కుండానే ఆ కుటంబంలో విషాదం నెలకొంది. వయనాడ్ విలయానికి ఆ కుటుంబంలోని 11 మంది ప్రాణాలు కోల్పోయారు. తన తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, సోదరుడు, వారి పిల్లలు మరుదలు అందర్నీ కోల్పోయాడు. ఈ ఘోర విపత్తులో మరణించినవారి సంఖ్య 222కు చేరింది. 31 గుర్తు తెలియని డెడ్ బాడీలను సోమవారం అధికారులు సామూహిక ఖననం చేశారు.



Tags:    

Similar News