TOP 6 News @ 6PM: తెలంగాణ ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలపై క్లారిటీ ఇచ్చిన టీటీడీ బోర్డ్

Update: 2025-03-17 12:30 GMT

TOP 6 News @ 6PM: తెలంగాణ ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలపై క్లారిటీ ఇచ్చిన టీటీడీ బోర్డ్

1) Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ముందుకు బీసీ, ఎస్సీ వర్గీకరణ బిల్లు

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో ఐదు కీలక బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టింది. ఎస్సీ వర్గీకరణకు అవకాశం కల్పిస్తూ బిల్లును రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రవేశ పెట్టారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టారు. దేవాదాయ చట్ట సవరణ బిల్లును మంత్రి కొండా సురేఖ,పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్శిటీ పేరును సురవరం ప్రతాప్ రెడ్డి పేరు మారుస్తూ, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు చేస్తూ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.

ఎన్నికలకు ముందు బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హమీ ఇచ్చింది. కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది. దీనికి అనుగుణంగా తెలంగాణ అసెంబ్లీ 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లును అసెంబ్లీ ఆమోదించి కేంద్రానికి పంపనుంది. బీసీల రిజర్వేషన్ల అంశం గురించి తేలకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి.

2) హిందీ భాషపై మొన్న పవన్ కళ్యాణ్, ఇవాళ చంద్రబాబు నాయుడు... ఎవరేమన్నారంటే...

Chandrababu Naidu about Hindi Language issue: హిందీ భాషపై ప్రస్తుతం ఒక పెద్ద వివాదం నడుస్తోంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 పేరుతో తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దొద్దని ఆ రాష్ట్ర సీఎం ఎం.కే. స్టాలిన్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా స్టాలిన్ పెద్ద ఉద్యమాన్నే నడిపిస్తున్నారు. ఇదిలావుండగా తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు హిందీ భాష వివాదంపై స్పందించారు.

ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ "భాష అనేది కేవలం సమాచార మార్పిడి కోసం ఉపయోగించే ఒక మాధ్యమం మాత్రమే" అని అన్నారు. " ఇంగ్లీష్ భాషతోనే విజ్ఞానం వస్తుందని ఒక అపోహ ఉంది. కానీ ఒక భాషతోనే విజ్ఞానం రాదు. తను ఆ మాటను అంగీకరించను. ప్రపంచంలో ఎక్కడ చూసినా.. తమ మాతృ భాషలో చదువుకున్న వారే ఎక్కువగా రాణిస్తున్నారు.ఎందుకంటే ఏ విషయమైనా మాతృభాషలో నేర్చుకోవడం ఈజీ అవుతుంది" అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

3) కోల్‌కతా ఆర్జీకర్ కేసు: సుప్రీంలో మృతురాలి పేరేంట్స్ పిటిషన్, కొట్టివేత

RG Kar rape-murder case: కోల్‌కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై రేప్, హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణ జరిపించాలని మృతురాలి పేరేంట్స్ కోరారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మృతురాలి పేరేంట్స్ తరపున సీనియర్ న్యాయవాది కరుణ వాదనలు వినిపించారు. సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహాతా వాదించారు.మృతురాలి పేరేంట్స్ కోల్‌కత్తా హైకోర్టు ముందు తమ వాదనలు వినిపించే స్వేచ్ఛను కలిగి ఉన్నారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ పిటిషన్ ను కొట్టివేసింది. కోల్ కత్తా హైకోర్టును ఆశ్రయించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.

జూనియర్ డాక్టర్ పై రేప్, అత్యాచారానికి పాల్పడిన కేసులో సంజయ్ రాయ్ ను కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఆయనకు మరణించే వరకు జీవితఖైదు విధించింది. కోర్టు తీర్పుపై బాధితురాలి పేరేంట్స్ అప్పట్లోనే అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కేసును తిరిగి దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టున ఆశ్రయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

4) తెలంగాణ ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలపై టీటీడీ బోర్డ్ క్లారిటీ

తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలను టీటీడీ బోర్డ్ పట్టించుకోవడం లేదని ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు ఏపీ సర్కారుపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తమ లేఖలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా వారు కోరుతూ వస్తున్నారు. తాజాగా టీటీడీ బోర్డు ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన చేసింది. తెలంగాణ ప్రతినిధుల సిఫార్సు లేఖలతో వచ్చే వారికి శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ స్పష్టంచేసింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ప్రకటించింది.

5) పాకిస్థాన్‌లో నెక్ట్స్ టార్గెట్ 26/11 మాస్టర్ మైండ్ హఫీజ్ సయీదేనా?

పాకిస్థాన్‌లో లష్కరే తొయిబా ఉగ్రవాది అబూ ఖతల్ హత్య సంచలనం సృష్టించింది. జమ్మూకశ్మీర్ సహా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో లష్కరే తొయిబా జరిపిన ఉగ్రవాద దాడుల్లో ఈ అబూ ఖతల్ కీలక సూత్రధారి. 2023 రాజౌరి ఎటాక్, 2024 రియాసి ఎటాక్, పూంచ్ ఎటాక్ సహా అనేక ఉగ్రాద దాడుల్లో భారత్ వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఈ అబూ ఖతల్.

లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌కు అబూ ఖతల్ సమీప బంధువు. శనివారం రాత్రి పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో జీలం జిల్లాలోని మంగ్లా-జీలం రోడ్డులో ఖతల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఆ సమయంలో ఖతల్ వెంట గార్డుగా ఉన్న గన్‌మేన్ కూడా ఈ కాల్పుల్లో చనిపోయాడు. గుర్తుతెలియని వ్యక్తులు హఫీజ్ సయీద్ దగ్గరి అనుచరుడైన అబూ ఖతల్‌ను చేరుకుని హత్య చేసిన తీరు సంచలనం సృష్టించింది. ఇక నెక్ట్స్ టార్గెట్ హఫీజ్ సయీదేనా అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఛాంపియన్స్ ట్రోఫీతో పాకిస్థాన్‌కు రూ. 869 కోట్లు నష్టం

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తో పాకిస్తాన్ రూ. 869 కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. సాధారణంగా క్రీడల పోటీలు నిర్వహించే క్రీడా సంస్థలు భారీ మొత్తంలో డబ్బు సంపాదించుకోవడం జరుగుతుంది. ఆయా క్రీడా సంస్థలకు క్రీడల పోటీలు అనేవి మంచి ఆదాయ మార్గంగా కనిపిస్తుంటాయి. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో మాత్రం పాకిస్థాన్‌కు లాభం రాకపోగా 85 అమెరికన్ మిలియన్ డాలర్ల నష్టం వచ్చిందని తాజా నివేదిక చెబుతోంది. ఇప్పటికే సొంత గడ్డపై ఆడి కూడా ఘోర పరాజయం పాలయ్యామనే అవమానంతో ఉన్న పాకిస్థాన్‌కు ఈ భారీ నష్టం న్యూస్ మరింత నిరాశకు గురిచేస్తోంది.

తాజాగా టెలిగ్రాఫ్ ఇండియాలో ప్రచురించిన ఒక వార్తా కథనం ప్రకారం పాకిస్తాన్‌కు ఈ ఓటములతో పాటు భారీ నష్టం కూడా వాటిల్లింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం రావల్పిండి, కరాచీ, లాహోర్ నగరాల్లోని స్టేడియంలను అభివృద్ధి చేశారు. అందుకోసం పాకిస్థాన్ 1800 కోట్ల పాకిస్తాన్ రూపాయలు ఖర్చు పెట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tags:    

Similar News