Nagpur Violence: ఔరంగజేబు సమాధి వివాదం..నాగ్పూర్ లో హింసాత్మక వాతావరణం..కొనసాగుతున్న కర్ఫ్యూ
Nagpur Violence: మహారాష్ట్రలోని నాగ్ పూర్ హింసాత్మక వాతావరణం నెలకొంది. ఔరంగజేబు సమాధి వివాదంపై రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఇరు వర్గాలు పరస్పర రాళ్లు రువ్వుకోగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఛత్రపతి శివాజీ నగర్ నుంచి ఔరంగాజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ భజరంగ్ దళ్ సభ్యులు మహల్ ప్రాంతంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఎదుట ఆందోళనకు దిగారు. ఔరంగాజేబు దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు.
అయితే నిరసనకారులు దిష్టిబొమ్మతో పాటు ముస్లిం సమాజ పవిత్ర గ్రంథం ఖురాన్ ను కూడా తగుల బెట్టారని సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించడంతో రెండు వర్గాల మధ్య హింస నెలకున్నట్లు పోలీసులు తెలిపారు. రెండు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోగా నలుగురికి గాయలు అయ్యాయి. అనేక వాహనాలను దుండగులు తగులబెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీచార్జ్ చేశారు.
చిట్నిష్ పార్క్ నుంచి శుక్రవారీ తలావ్ రోడ్డు బెల్ట్ వరకు హింస ఎక్కువగా ప్రభావితమైందని అధికారులు చెప్పారు. అయితే మత గ్రంథాన్ని తగుళబెట్టారనే ఆరోపణలను బజరంగ్ దళ్ నేతలు తోసిపుచ్చారు. తమ ప్రదర్శనలో భాగంగా ఔరంగజేబు దిష్టిబొమ్మను మాత్రమే దహనం చేశామన్నారు. ఈ ఘటనపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ప్రజలు పుకార్లను నమ్మకూడదని సూచించారు. ప్రభుత్వానికి సహకరించాలని విజ్నప్తి చేశారు. అల్లర్ల నేపథ్యంలో నాగ్ పూర్ లో భారీగా బలగాలను మోహరించారు.