లెక్స్ ఫ్రిడ్‌మన్‌కు మోదీ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ... గోద్రా అల్లర్లు, ఉగ్రవాద దాడులపై ఏమన్నారంటే

Update: 2025-03-16 14:15 GMT

లెక్స్ ఫ్రిడ్‌మన్‌కు మోదీ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ... గోద్రా అల్లర్లు, ఉగ్రవాద దాడులపై లెక్స్ ప్రశ్నలు

Who is Lex Fridman: అమెరికా కంప్యూటర్ సైంటిస్ట్, పాడ్ కాస్టర్ లెక్స్ ఫ్రిడ్ మన్ కు ప్రధాని మోదీ ఇంటర్వ్యూ ఇచ్చారు. 3 గంటల పాటు కొనసాగిన ఈ సుదీర్ఘమైన ఇంటర్వ్యూలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఉగ్రవాద దాడులు, గోద్రా అల్లర్లు వంటివి అందులో ముఖ్యమైనవిగా ఉన్నాయి. 2002 నాటి గోద్రా అల్లర్ల గురించి ప్రస్తావించడంతో పాటు ఆ వివాదం నుండి ఏం నేర్చుకున్నారని ఫ్రిడ్‌మన్ ప్రధాని మోదీని ప్రశ్నించారు.

లెక్స్ ఫ్రిడ్‌మన్ సంధించిన ఈ ప్రశ్నకు మోదీ స్పందిస్తూ... గుజరాత్‌లో అల్లర్లు జరగడం అదేం మొదటిసారి కానీ గోద్రా అల్లర్ల చుట్టు ఒక నకిలీ కథ అల్లారని అన్నారు. 2002 కంటే ముందుగా గుజరాత్‌లో 250 కి పైగా అల్లర్లు జరిగాయని గుర్తుచేశారు.

అంతేకాకుండా ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా అనేక ఉగ్రవాద దాడులు, విధ్వంసాలు జరిగాయన్నారు. అందులో గోద్రా అల్లర్లు కూడా ఒక భాగమేనని మోదీ చెప్పారు. కానీ 2002 తరువాత గుజరాత్‌లో మళ్లీ అలాంటి అల్లర్లు జరగలేదన్నారు. కానీ కొంతమంది కావాలనే తన ప్రతిష్టను దెబ్బతీయడం కోసం కట్టుకథ అల్లారని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా న్యాయం ఏంటో కోర్టు చెప్పింది కదా అని గోద్రా అల్లర్లపై సుప్రీం కోర్టు తీర్పును గుర్తుచేశారు.

ఒకదాని తరువాత ఒకటిగా జరిగిన ఉగ్రవాద దాడుల సీక్వెన్స్‌ను కూడా ప్రధాని మోదీ గుర్తుచేశారు. కాందహార్ హైజాక్, అమెరికా 9/11 దాడులు, జమ్మూకశ్మీర్ అసెంబ్లీతోపాటు భారత పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడులు చేసిన ఘటనలను విశ్లేషించారు. తను గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేనాటికే ఉగ్రవాద దాడులతో పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందన్నారు. ఈ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఇంకా అనేక వివాదాలు, సంచలన నిర్ణయాలు తెరపైకొచ్చాయి. వాటికి ప్రధాని మోదీ ఏమని సమాధానం ఇచ్చారో మీరే చూడండి. 

Full View

Tags:    

Similar News