TOP 6 NEWS @ 6PM: ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏంటో మీకు చెబుతా వినండి - రేవంత్ రెడ్డి

Update: 2025-03-16 12:30 GMT
Telangana CM Revanth Reddy speech from Warangal meeting and AP CM Chandrababu Naidu about Potti Sriramulu birth anniversary

ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏంటో మీకు చెబుతా వినండి - వరంగల్ సభలో రేవంత్ రెడ్డి

  • whatsapp icon

1) రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందో మీకు తెలియాలి - రేవంత్ రెడ్డి

వరంగల్‌కు ఎయిర్ పోర్ట్ తీసుకొస్తానని లోక్ సభ ఎన్నికల ప్రచారం సమయంలో మాటిచ్చాను. అప్పుడు మాటిచ్చినట్లుగానే ఇప్పుడు వరంగల్ ఎయిర్ పోర్టు తో మీ ముందుకొచ్చానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాతే వరంగల్‌కు ఎయిర్ పోర్ట్ రింగ్ రోడ్డు వచ్చిందన్నారు. నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి పోరాడిన ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే తనకు ఎంతో అభిమానం అని చెప్పారు. ఇవాళ స్టేషన్ ఘణపూర్‌లో రూ. 800 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు పలు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా శివునిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇబ్బందులు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం రూ.8.29 లక్షల కోట్ల అప్పును మా ప్రభుత్వం నెత్తిన పెట్టారు. ఆ అప్పును తీర్చడం కోసం ఒక్క ఏడాదిలోనే ప్రభుత్వం 84 వేల కోట్లు వడ్డీల కింద, మరో 64 వేల కోట్లు అసలు కింద చెల్లించాల్సి వచ్చిందన్నారు. ఒకవైపు గత ప్రభుత్వం చేసిన అప్పులు చెల్లిస్తూనే మరోవైపు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

2) ఏపీ రాజధానిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం - చంద్రబాబు నాయుడు

ఏపీ రాజధాని అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుుడు ప్రకటించారు. అలాగే ఆయన పేరుపై ఒక స్మారక వనం కూడా నిర్మిస్తామని అన్నారు. నెల్లూరు జిల్లాలోని పొట్టి శ్రీరాములు స్వగ్రామంలో మ్యూజియం, ఆధునిక పాఠశాల నిర్మించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఉండవల్లిలో తన అధికారిక నివాసంలో సీఎం చంద్రబాబు ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ ఏడాది పాటు పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలు చేయనున్నట్లు తెలిపారు. 

3) Summer Heat Alert: భగభగ మండుతున్న సూర్యుడు.. తెలుగు రాష్ట్రాలకు హీట్ అలర్ట్

Summer Heat Alert: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. నేడు కూడా అదే పరిస్థితి ఉండనుంది. వీకెండ్ టూర్లు, ప్రయాణం చేసేవారికి నేడు ఎండతో ఎంతో ఇబ్బంది ఉండనుంది. కొంత గాలులు వీస్తుంటాయి. కర్నాటక, తెలంగాణ, రాయలసీమలో శనివారం అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. శాటిలైట్ అంచనాల ప్రకారం..భూమధ్య రేఖా ప్రాంతంలో దట్టంగా మేఘాలు ఉన్నాయి. భారతదేశ దక్షిణ ప్రాంతాల్లో మేఘాలు అంతగా లేవు. అందుకే నేడు ఏపీ,తెలంగాణ ప్రాంతాల్లో పొడి వాతావరణమే ఉంటుంది. అయితే సోమవారం మాత్రం మేఘాలు వచ్చే అవకాశం ఉంది.

ఇక పలు చోట్లు సాధరణ ఉష్ణోగ్రత కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జనాలు ఉక్కిరిబిక్కి అవుతున్నారు. గాలిలో తేమ పడిపోవడంతో ఎండ పెరగడానికి కారణమని వాతావరణ శాఖ చెబుతోంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటినట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయినట్లు వివరించింది. రానున్న రెండు రోజుల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. అత్యవసరం అనుకుంటే తప్ప..బయటకు రావద్దని ఒకవేళా వెళ్లినా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. 

4) నైట్ క్లబ్‌లో అగ్ని ప్రమాదం.. 51 మంది మృతి, మరో 100 మందికి గాయాలు

North Macedonia's fire acident: ఉత్తర మేసిడొనియాలోని కొకని పట్టణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక నైట్ క్లబ్‌లో చెలరేగిన మంటలు క్షణాల్లో క్లబ్ అంతా వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో 51 మంది చనిపోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. కొకనిలో అర్థరాత్రి 2:35 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. స్థానిక పాప్ గ్రూప్ నిర్వహిస్తూన్న లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ ఎంజాయ్ చేసేందుకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు.

ఈ లైవ్ కన్సర్ట్ జరుగుతున్న సమయంలో కొంతమంది యువకులు పైరోటెక్నిక్స్ కాల్చారు. దీంతో పై కప్పుకు ఆ మంటలు అంటుకుని అగ్ని ప్రమాదానికి దారితీసిందని ఉత్తర మేసిడోనియా మంత్రి పంచె తోష్‌కువోస్కి తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5) పెళ్లికి పిలిచి, భోజనానికి రూ. 3,800 చార్జ్ చేస్తామంటే ఎలా?

పెళ్లిలో విందు భోజనం ఫ్రీ అనే విషయం అందరికీ తెలిసిందే. పంచభక్ష పరమాన్నాలు పెట్టినా, లేక పప్పన్నమే పెట్టినా... అది ఉచితమే కానీ దానికి ఎవ్వరూ డబ్బులు తీసుకోరు. ఇందులో ఎవ్వరికైనా సరే రెండో ఆలోచన అనేదే ఉండదు.

విదేశాల్లో జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే అక్కడి ఏర్పాట్లపై ఇంకాస్త ఎక్కువ అంచనాలే ఉంటాయి. అంత ఖర్చు పెట్టుకుని పెళ్లికి వెళ్లినందుకుగాను అక్కడి ఏర్పాట్లతో ఎంజాయ్ చేయొచ్చులే అనే ఆ పెళ్లికి వెళ్లే గెస్టులు భావిస్తారు. కానీ ఇప్పుడు మీు తెలుసుకోబోయే ఈ పెళ్లి కహానీ మాత్రం వేరే. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ స్టోరీలో పెళ్లికి పిలిచిన వారు అతిధులకు భలే ట్విస్ట్ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) WPL 2025: భారీ రికార్డును సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్‌కు చెందిన నటాలీ స్కైవర్ బ్రంట్

WPL 2025: ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి రెండోసారి మహిళల ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను గెలుచుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌ను ఛాంపియన్‌గా చేయడంలో ఆల్ రౌండర్ నటాలీ స్కీవర్ బ్రంట్ కీలక పాత్ర పోషించింది. తన బ్యాటింగ్‌తో పాటు, తన బౌలింగ్‌తో ముంబై ఇండియన్స్‌ను విజయతీరాలకు చేర్చారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్‌లో నటాలీ స్కైవర్ బ్రంట్ 28 బంతుల్లో 30 పరుగులు చేసింది. అలాగే, ఈ సీజన్‌లో తను 500 పరుగుల మార్కును దాటింది. ఈ టోర్నమెంట్ చరిత్రలో తొలిసారిగా ఒక బ్యాట్స్‌మన్ ఈ ఘనత సాధించింది.

మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్రలో నటాలీ స్కైవర్ బ్రంట్ తప్ప మరే బ్యాట్స్‌మన్ 500 పరుగుల మార్కును తాకలేదు. ఇది కాకుండా, నటాలీ స్కైవర్ బ్రంట్ ఈ టోర్నమెంట్‌లో తన 1000 పరుగులను పూర్తి చేసింది. ఇలా చేసిన ఏకైక క్రికెటర్ నటాలీ స్కీవర్ బ్రంట్. ఈ సీజన్‌లో నటాలీ స్కైవర్ బ్రంట్ చాలా పరుగులు చేసింది. అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో నటాలీ స్కీవర్ బ్రంట్ అగ్రస్థానంలో నిలిచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tags:    

Similar News