కోల్‌కతా ఆర్జీకర్ కేసు: సుప్రీంలో మృతురాలి పేరేంట్స్ పిటిషన్, కొట్టివేత
RG Kar rape-murder case: కోల్‌కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై రేప్, హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణ జరిపించాలని మృతురాలి పేరేంట్స్ కోరారు.

కోల్‌కతా ఆర్జీకర్ కేసు: మృతురాలి పేరేంట్స్ పిటిషన్, కొట్టివేత
RG Kar rape-murder case: కోల్‌కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై రేప్, హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణ జరిపించాలని మృతురాలి పేరేంట్స్ కోరారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మృతురాలి పేరేంట్స్ తరపున సీనియర్ న్యాయవాది కరుణ వాదనలు వినిపించారు. సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహాతా వాదించారు.మృతురాలి పేరేంట్స్ కోల్‌కత్తా హైకోర్టు ముందు తమ వాదనలు వినిపించే స్వేచ్ఛను కలిగి ఉన్నారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ పిటిషన్ ను కొట్టివేసింది. కోల్ కత్తా హైకోర్టును ఆశ్రయించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.
జూనియర్ డాక్టర్ పై రేప్, అత్యాచారానికి పాల్పడిన కేసులో సంజయ్ రాయ్ ను కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఆయనకు మరణించే వరకు జీవితఖైదు విధించింది. కోర్టు తీర్పుపై బాధితురాలి పేరేంట్స్ అప్పట్లోనే అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కేసును తిరిగి దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టున ఆశ్రయించారు.
2024 ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ విధులకు హాజరయ్యారు. మరునాడే ఆమె మృతదేహన్ని సిబ్బంది గుర్తించారు. ఈ కేసులో సంజయ్ రాయ్ ను దోషిగా గుర్తించి సిల్దా కోర్టు జీవితఖైదు విధించింది. బాధిత కుటుంబానికి రూ. 17 లక్షల పరిహారం చెల్లించారు.