Top 6 News @ 6PM: జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్‌ లేటెస్ట్ అప్‌డేట్స్.. మరో టాప్ 5 న్యూస్ హెడ్‌లైన్స్

Update: 2024-09-25 12:29 GMT

1) సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.400 కోట్లు విరాళం రావడం ఓ చరిత్ర

వరద బాధితుల సహాయం కోసం సీఎం సహాయనిధికి రూ. 400 కోట్లు రావడం ఒక చరిత్ర అని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. విజయవాడలో వరద బాధితులకు ఆర్ధిక సహాయాన్ని బుధవారం సీఎం అందించారు. ప్రకృతి విపత్తు సంభవించిన సమయంలో అందరూ ఒక్కటై పనిచేశామన్నారు. వర్షం నీరు ఒకవైపు వస్తున్న సమయంలో మరోవైపు బుడమేరు పోటెత్తినా అధికారులతో కలిసి తాను బురదలో దిగి సహాయక చర్యలు చేపట్టినట్టుగా ఆయన చెప్పారు. వరద బాధితులను ఆదుకున్నామని ఆయన తెలిపారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2) ముగిసిన కాళేశ్వరం కమిషన్ విచారణ

కాళేశ్వరంపై కమిషన్ విచారణ కొనసాగుతోంది. బుధవారం నాటి విచారణకు కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకట అప్పారావు, ఇరిగేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పద్మావతి, వర్క్స్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ మణిభూషణ్‌ శర్మ హాజరయ్యారు. అధికారులపై కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. ఏ ప్రాతిపదికన లోన్లు తీసుకుంటారని కమిషన్ ప్రశ్నించింది. ప్రభుత్వ అప్రూవల్‌తోనే కార్పొరేషన్ లోన్‌కు వెళ్తుందని అధికారుల కమిషన్‌కు తెలిపారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

3) సిద్ధరామయ్యపై దర్యాప్తునకు కోర్టు ఆదేశాలు.. అసలేంటీ ముడా స్కామ్ వివాదం?

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సంచలనం సృష్టించిన ముడా స్కామ్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణకు ఆదేశిస్తూ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు మైసూరు లోకాయుక్త పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతితో పాటు ముడా స్కామ్ ఆరోపణలతో ముడిపడి ఉన్న ఇతరులను అందరినీ ప్రశ్నించాల్సిందిగా ప్రజాప్రతినిధుల కోర్టు తమ ఆదేశాల్లో పేర్కొంది. 3 నెలల్లోగా వారిని ప్రశ్నించి, పూర్తి నివేదిక అందించాల్సిందిగా కోర్టు తమ ఆదేశాల్లో స్పష్టంచేసింది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

4) యూట్యూబర్ హర్షసాయి కోసం కొనసాగుతున్న గాలింపు

యూట్యూబర్ హర్షసాయి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేయగా.. పరారీలో ఉన్న హర్షసాయిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతని కోసం హైదరాబాద్‌ నుండి విశాఖకు స్పెషల్ టీమ్ చేరుకుంది. పరారీలో ఉన్న హర్షసాయి, అతని తండ్రి రాధాకృష్ణ కోసం.. MVP పోలీస్ స్టేషన్ పరిధిలోని అతని ఇంటి సమీపంలో గాలిస్తున్నారు పోలీసులు. హర్షసాయి బంధువులు, స్నేహితులను అతని ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. ఇప్పటికే హర్షసాయి ఈ కేసు విషయంలో విజయవాడకు చెందిన లాయర్‌ను నియమించుకోవడంతో.. విశాఖలో హర్షసాయి ఆచూకీ దొరకకపోతే విజయవాడలో గాలింపు చేపట్టనున్నారు.

5) యువత డ్రగ్స్ కు బానిసలు కావొద్దు

తెలంగాణను డ్రగ్స్ రహిత సమాజంగా మార్చాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి మద్దతు తెలిపారు నటుడు జూనియర్ ఎన్టీఆర్. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, యువత డ్రగ్స్ కు బానిసలు కావొద్దని ఎన్టీఆర్ సూచించారు. దేవర సినిమా రిలీజ్ నేపథ్యంలో డ్రగ్స్ నిర్మూలన కోసం సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో సందేశాన్ని పంపారు. మీ చుట్టూ ఉన్నవారు డ్రగ్స్ వినియోగిస్తున్నా,, అమ్మినా సంబంధిత పోలీస్ శాఖకు సమాచారం అందించాలని హితవు పలికారు ఎన్టీఆర్.

6) జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్‌పై కీలక తీర్పు ఇచ్చిన కోర్ట్

లైంగిక ఆరోపణల కేసులో అరెస్టైన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. జానీకి 4 రోజుల పోలీస్ కస్టడీ విధించింది రంగారెడ్డి కోర్టు. థర్డ్‌ డిగ్రీ ప్రయోగించవద్దని.. అవసరమైతే న్యాయవాది సమక్షంలో విచారించాలని సూచించింది. దీంతో చర్లపల్లి జైల్లో ఉన్న జానీని.. నేటి నుంచి నాలుగు రోజుల పాటు కస్టడీకి తీసుకొని పోలీసులు ప్రశ్నించనున్నారు. లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో జానీ మాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అనుమతి నేపథ్యంలో జానీ మాస్టర్‌ను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. ఈనెల 28 వరకు నార్సింగి పోలీసులు ఆయన్ను ప్రశ్నించనున్నారు.

Tags:    

Similar News