Petrol Diesel Price Today: భగ్గుమంటోన్న పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol Diesel Price Today: మళ్లీ పెట్రోల్, డీజిల్ పై 25 పైసలు చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి
Petrol Diesel Price Today: అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించని కేంద్రం... ఇప్పుడు ధరలు పెంచడానికి మాత్రం అంతర్జాతీయ ధరలే కారణమని చెబుతోంది. వీటికి తోడు కేంద్రం, రాష్ట్రాలు వేసే పన్నుల వల్ల పెట్రోల్, డీజిల్ వినియోగదారులపై విపరీతమైన భారం పడుతోంది. మరోవైపు ఈ ధరల వలన రవాణా చార్జీలు కూడా పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. అసలే సంక్షోభం.. ఆ పై కోవిడ్ దెబ్బ.. వీటితో కుదేలైన సామాన్యుడు.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో తీవ్రంగా దెబ్బ తింటున్నాడు.
కాని దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదలనే కారణమని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పుకొస్తున్నారు. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురుపై కేంద్ర, రాష్ట్రాలు పన్నులు విధించడం వల్ల.. ఒక లీటర్ పెట్రోల్, డీజీల్ ధరలు రూ. 100 దాటిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
దేశంలోని వివిధ నగరాల్లో...
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.12 కి చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.98 కి చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.102.30, డీజిల్ రూ.94.39 కు పెరిగింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.43 ఉండగా.. డీజిల్ రూ.91.64 గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.06 గా.. డీజిల్ ధర రూ.89.83 గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.99.33 డీజిల్ రూ.92.21 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో …
తెలంగాణ హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర.99.90, లీటర్ డీజిల్ రూ.94.82 కు చేరగా, వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర 99.60, డీజిల్ ధర 94.54 గా ఉంది. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో పెట్రోల్ ధర రూ.102.25 గా ఉండగా.. రూ. 96.58 కు చేరగా, విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 101.05 ఉండగా.. డీజీల్ ధర రూ.95.41 గా కొనసాగుతోంది.