Gold Price Today: తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Price Today: నిన్న కాస్త పెరిగిన బంగారం ధర నేడు మళ్లీ తగ్గింది. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది.
Gold Price Today: కరోనా సెకండ్ వేవ్ దేశంలో విజృంభిస్తుండడంతో.. గత కొన్ని రోజులుగా పుత్తడి ధరలు పెరుగుతూ వచ్చాయి. ఒకనొక దశలో ఆల్ టైం రికార్డ్ స్థాయిలో బంగారం ధరలు పెరుగుదలను నమోదుచేసుకున్నాయి. ఇక నిన్నటితో పోల్చుకుంటే.. శనివారం ఉదయం బంగారం ధరలు నెల వైపు చూస్తున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.45,060కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.46,060కు చేరింది.
ప్రధాన నగరాల్లో...
దేశీయ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,360 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,580కు చేరింది. ముంబై మార్కెట్లో సైతం బంగారం ధరలలో మార్పులు జరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.45,060 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.46,060 ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 44,950 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.49,040 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో...
హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.44,800 ఉండగా10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,870గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,800 ఉండగా… 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,870గా ఉంది.
బంగారం బాటలోనే వెండి ధరలు...
పసిడి బాటలోనే వెండి కూడా భారీగానే పతనమైంది. శనివారం సిల్వర్ రేట్ కూడా దిగొచ్చింది. దీంతో వెండి కొనాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే విషయమని చెప్పుకోవచ్చు. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల వెండి రూ.689గా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.68,900కు చేరింది.
ప్రధాన నగరాల్లో ఉన్న ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.689 ఉండగా.. కేజీ ధర రూ.68,900గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల సిల్వర్ రూ.689గా ఉండగా.. కిలో వెండి రూ.68,900గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల ధర రూ.743 ఉండగా.. కిలో వెండి రూ.74,300కు చేరింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ.743 ఉండగా.. కేజీ సిల్వర్.. రూ.74,300గా ఉంది. ఇక ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల వెండి ధర రూ.743 ఉండగా.. కిలో వెండి ధర రూ.74,300గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న బంగారం ధరలు 24-04-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.