మణిపూర్ ఘటనను సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు
*కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోకపోతే.. తామే చర్యలు తీసుకుంటామని తెలిపిన సుప్రీంకోర్టు
Manipur Incident: మణిపూర్ ఘటనను సుమోటోగా తీసుకుంది సుప్రీంకోర్టు. మణిపూర్ ఘటన బాధాకరమన్న ధర్మాసనం.. మహిళలపై అమానవీయ ఘటన రాజ్యాంగ ఉల్లంఘన కిందకి వస్తుందని తెలిపింది. బహిర్గతమైన వీడియోల వల్ల ప్రజలు ఆవేదనకు గురవుతున్నారని పేర్కొంది. ఘటనపై ఏం చర్యలు తీసుకున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించిన సుప్రీంకోర్టు.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోకపోతే తామే చర్యలు తీసుకుంటామని తెలిపింది.