Aadhar Card Update: ఫ్రీగా ఆధార్ కార్డు ఆన్‌లైన్లో అప్డేట్ చేసుకోండిలా... Step by Step Guide

Aadhar Free Update: ఆధార్‌ను ఉచితంగా ఆన్‌లైన్లో అప్డేట్ చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 14. ఈ తేదీలోగా చేసుకోకపోతే, ఆ తరువాత అయితే 50 రూపాయల ఫీజు కట్టాల్సి ఉంటుంది.

Update: 2024-08-28 15:13 GMT

Aadhar Free Update

Aadhar Free Update: ఆదార్ ఎన్‌రోల్‌మెంట్ అండ్ అప్డేట్ రెగ్యులేషన్ – 2016 నిబంధనల ప్రకారం ప్రతి వ్యక్తి ప్రతి 10 ఏళ్ళకోసారి ఆధార్ కార్డులో గుర్తింపు ధ్రువీకరణ, చిరునామా ధ్రువీకరణ వివరాలను అప్డేట్ చేసుకోవాలి. ఆధార్ ఎన్‌రోల్ చేసుకున్న తేదీ నుంచి 10 ఏళ్ళకోసారి PoI అంటే ప్రూఫ్ ఆప్ ఐడెంటిటీ, PoA అంటే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్లు కొత్త వాటిని అప్లోడ్ చేసి అప్డేట్ చేసుకోవాలి. గత పదేళ్ళలో ఈ పని చేయనివారు ఇప్పటికైనా చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవడం ఎవరికైనా చాలా మంచిది.

ఆధార్ అప్డేట్ అయి ఉంటే కార్డు ద్వారా మిమ్మల్ని ఎవరూ మోసం చేయడానికి వీలు ఉండదు. ఆధార్‌ను ఉచితంగా ఆన్‌లైన్లో అప్డేట్ చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 14. ఈ తేదీలోగా చేసుకోకపోతే, ఆ తరువాత అయితే 50 రూపాయల ఫీజు కట్టాల్సి ఉంటుంది. స్వయంగా ఆన్‌లైన్లో చేసుకుంటే 25 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

ఆధార్‌ను ఉచితంగా అప్డేట్ చేసుకోవడం ఎలా?

ఎవరైనా సరే myAadhaar పోర్టల్‌కు వెళ్ళి తమ గుర్తింపు, చిరునామా ప్రూఫ్‌లను ఆన్‌లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు. అదెలాగో స్టెప్ బై స్టెప్ చూద్దాం.

Step 1: మొదట ఇంటర్నెట్ బ్రౌజర్ తెరిచి myAadhaar portal లోకి వెళ్ళండి.


Step 2: లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్ టైప్ చేయండి. ఆ తరువాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ‘Send OTP’ బటన్ క్లిక్ చేయండి. ఓటీపీ రాగానే టైప్ చేసి ‘Login’ బటన్ నొక్కండి.


Step 3: ఇప్పుడు డాక్యుమెంట్ అప్డేట్ బటన్ క్లిక్ చేయండి.


Step 4: తరువాత గైడ్ లైన్స్ చదివి, ‘Next’ బటన్ క్లిక్ చేయండి.


Step 5: ‘Verify Your Demographic Details’ పేజిలో పై వివరాలు సరైనవే అని రాసి ఉన్న బాక్స్ క్లిక్ చేయండి. తరువాత నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.



Step 6: ఈ దశలో ఐటెండిటీ ప్రూఫ్ అప్లోడ్ చేయండి. తరువాత అడ్రస్ ప్రూఫ్ కూడా అప్లోడ్ చేసి ‘Submit’ క్లిక్ చేయండి.



Step 7: అప్పుడు మీకు ‘Service Request Number (SRN)’ మీ ఇమెయిల్ ద్వారా అందుతుంది. ఎస్ఆర్ఎన్ లో మీ డాక్యుమెంట్స్ అప్డేట్ అయిందీ లేనిదీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ పుర్తి చేసిన తరువాత ఏడు పని దినాల్లో మీ ఆధార్ కార్డ్ వివరాలు అప్డేట్ అవుతాయి.

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ పేరు, అడ్రస్, పుట్టిన రోజు, మొబైల్ నంబర్ వంటి మీ డెమోగ్రాఫిక్ వివరాలు సరిపోలితేనే మీరు మీ ఆధార్ డాక్యుమెంట్స్ అప్డేట్ చేయగలుగుతారు. మీ అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ మీద ఉన్న వివరాలు మ్యాచ్ కాకపోతే, ముందు మీరు వాటిని ఆధార్ కార్డులో అప్డేట్ చేయాలి. ఆ తరువాత ఆధార్ కార్డు ప్రూఫ్ డాక్యుమెంట్స్ అప్డేట్ చేయాలి.

మీరు మీ ఆధార్ కార్డులో మీ చిరునామాను ఆన్ లైన్లో అప్డేట్ చేయాలంటే ఈ పద్ధతి అనుసరించాలి:

Step 1: ఇంటర్నెట్ బ్రౌజర్లో myAadhaar portal కు వెళ్ళండి.

Step 2: లాగిన్ బటన్ క్లిక్ చేయండి. ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ టైప్ చేసి ‘Send OTP’ బటన్ నొక్కండి. ఓటీపీ ఎంటర్ చేసి మళ్ళీ లాగిన్ బటన్ నొక్కండి.

Step 3: ఇప్పుడు ‘Address Update’ బటన్ నొక్కండి.

Step 4: తరువాత పేజీలో ‘Update Aadhaar Online’ బటన్ నొక్కండి.

Step 5: గైడ్ లైన్స్ చదివాక, ‘Proceed to Update Aadhaar’ అంటే ఆధార్ అప్డేట్ చేయండని సూచించే బటన్ నొక్కండి.

Step 6: అప్పుడు అడ్రస్ ఆప్షన్ సెలెక్ట్ చేసి, “ప్రోసీడ్ టు అప్డేట్ ఆధార్” క్లిక్ చేయండి.

Step 7: అడ్రస్ ఎంటర్ చేసి, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంటును అప్లోడ్ చేయండి. ఇక, Next బటన్ క్లిక్ చేయండి.

Step 8: ఇప్పుడు మీ వివరాల ప్రివ్యూ చూడండి. ఫీజు చెల్లింది, ‘Submit’ క్లిక్ చేయండి.

మీరు myAadhaar portal లో ఫీజు చెల్లించి మాత్రమే ఈ వివరాలు అప్డేట్ చేయగలుగుతారు. వేలిముద్రలు, ఐరిస్ వంటి బయోమెట్రిక్ వివరాలతో పాటు పేరు, లింగం, పుట్టినరోజు, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ వంటి డెమోగ్రాఫికల్ వివరాలు అప్డేట్ చేయాలంటే మాత్రం మీరు మీ సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్ళాలి.

ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్

myAadhaar portal లో మీ వివరాలు అప్డేట్ చేయడానికి ఈ కింద తెలిపిన పత్రాలు కావాలి.

ఐడెంటిటీ ప్రూఫ్: పాస్ పోర్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, వోటరు ఐడి, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు (రెసిడెంట్ సర్టిఫికెట్, జన్-ఆధార్, లేబర్ కార్డ్, స్థానికత పత్రం వంటివి), మార్క్స్ షీట్, మ్యారేజి సర్టిఫికేట్, రేషన్ కార్డులలో ఏదైనా ఒకటి సరిపోతుంది.

అడ్రస్ ప్రూఫ్: కనీసం ఇటీవలి 3 నెలల బ్యాంక్ స్టేట్మెంట్, గత మూడు నెలల్లో ఇచ్చిన కరెంటు లేదా గ్యాస్ కనెక్షన్ బిల్లు, పాస్ పోర్టు, మ్యారేజి సర్టిఫికేట్, రేషన్ కార్డు, ఏడాది లోపల చెల్లించిన ప్రాపర్టీ ట్యాక్స్ రశీదు లేదా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు... వీటిలో ఏదైనా ఒకటి సరిపోతుంది.

ఈ విధంగా మీరు 2024 సెప్టెంబర్ 14 లోగా మీ ఆధార్ వివరాలను ఆన్‌లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. మీరు ఇలా వ్యక్తిగత వివరాలను అప్డేట్ చేసుకోవడం వల్ల దేశ జన గణన సమచారం మరింత కచ్చితంగా రూపొందే అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News