Ration Cards: మీ ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా? అయితే రేషన్ కార్డు కట్

Ration Cards: అర్హత లేనివారు కూడా ప్రభుత్వ పథకాలను వినియోగించుకుంటున్నారు. ఈ విషయం అధికారుల వరకు వెళ్తే చర్యలు తప్పవు. అయితే కొందరు అనర్హులకు కూడా రేషన్ కార్డులు జారీఅయినట్లు ఆరోపణలు రావడంతో..ఇప్పుడు వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది.

Update: 2024-08-05 04:27 GMT

 New Ration Cards: నేడు రేషన్ కార్డుల విధివిధానాలు విడుదల..పూర్తి వివరాలివే

Ration Cards:జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం..ఆహారశాఖ ద్వారా పేద ప్రజలకు రేషన్ కార్డులు జారీ చేస్తారు. ఈ రేషన్ కార్డుల ఆధారంగానే నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందుతాయి. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారి అవసరాల కోసం రేషన్ కార్డులను అందిస్తోంది ప్రభుత్వం. పలు రాష్ట్రాల్లో వాటి తయారీకి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు ఆన్ లైన్, ఆఫ్ లైన్ దరఖాస్తులను అందిస్తాయి. కొన్ని ఇతర రాష్ట్రాలు ఆఫ్ లైన్ ప్రక్రియ ద్వారా మాత్రమే రేషన్ కార్డు దరఖాస్తులను స్వీకరిస్తాయి.భారత ప్రభుత్వం రేషన్ కార్డు పొందేందుకు నిర్దిష్ట అర్హతలను ప్రమాణాలను నిర్దేశించింది.

ఒక వ్యక్తి ప్లాట్ లేదా ఇల్లుతో సహా 100 చదరపు మీటర్ల కంటే ఎక్కువ భూమిని కలిగి ఉంటే..వారు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హలు కాదు. అంతేకాదు ఎవరైనా కారు లేదా ట్రాక్టర్ వంటి ఫోర్ వీలర్ వెహికల్స్ కలిగి ఉంటే..వారు కూడా రేషన్ కార్డు పొందేందుకు అనర్హులు. ఇంట్లో ఫ్రిజర్, ఏసీ ఉన్నవారు కూడా రేషన్ కార్డును దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులుగా ప్రకటించింది. కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఉంటే వారికి ప్రభుత్వం రేషన్ కార్డు జారీ చేయదు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాల్లో రూ. 2లక్షలు, నగరాల్లో రూ. 3లక్షల లోపు ఉండాలి. కుటుంబ ఆదాయం ఈ పరిమితి దాటితే వారు రేషన్ కార్డును పొందడానికి అనర్హులు.

ఇక ఏటా ఆదాయపు పన్ను దాఖలు చేసేవారు కూడా రేషన్ కార్డుకు అనర్హులు. లైసెన్స్ పొందిన ఆయుధాలు కలిగి ఉంటే వారు కూడా రేషన్ కార్డును అర్హులే. మీరు ఒకవేళ తప్పుడు పత్రాలు సమర్పించి రేషన్ కార్డును పొందినట్లయితే..దానిని వెంటనే సరెండర్ చేయాలి. లేదంటే మోసపూరితంగా రేషన్ కార్డులు పొందిన వ్యక్తులను భారత ప్రభుత్వం గుర్తిస్తోంది. మీకు రేషన్ కార్డు ఉన్నప్పటికీ అర్హత ప్రమాణాలకు అనుగుణంగా లేనట్లయితే మీరు ఆహారశాఖ ఆఫీసుకు వెళ్లి మీ రేషన్ కార్డును సరేండర్ చేయాలి. 

Tags:    

Similar News