Supreme Court: పౌరసత్వ చట్టం 1955 సెక్షన్ 6 ఎ ను సమర్థించిన సుప్రీంకోర్టు
Supreme Court: పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్ 6ఎ రాజ్యాంగబద్దతను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం సమర్థించింది.
Supreme Court: పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్ 6ఎ రాజ్యాంగబద్దతను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం సమర్థించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం 4:1 మెజారిటీతో తీర్పును వెలువరించింది. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో జస్టిస్ పార్థీవాలా మాత్రమే రాజ్యాంగవిరుద్దమని భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు.
అక్రమ వలసలకు అస్సాం అకార్డ్ ఓ రాజకీయ పరిష్కారం.అదే సమయంలో సెక్షన్ 6 అనేది చట్టబద్దమైన మార్గం. ఈ నిబంధనలు రూపొందించడానికి మెజారిటీతో కూడిన పార్లమెంట్ కు శక్తి ఉంది.స్థానికుల ప్రయోజనాలకు కాపాడే సమతౌల్యత ఈ సెక్షన్ కు ఉంది. ఇక దీనిలోని కటాఫ్ డేట్ గా నిర్ణయించిన 1971 మార్చి 25 అనేది సరైంది. పౌరసత్వచట్టం 1955 సెక్షన్ 6 ఎ ప్రకారం 1966 జనవరి నుంచి 1971 మార్చి 25 లోపు అస్సాంకు వచ్చిన వలసదారులు పౌరసత్వం కోరవచ్చు. ఈ నిబంధనను 1985లో అస్సాం అకార్డ్ తర్వాత తీసుకువచ్చారు.