ఎస్పీ బాలసుబ్రమణ్యంకు మరోసారి అస్వస్థత!

Update: 2020-09-24 12:33 GMT

ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరోసారి అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. దాంతో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారాయణ. ఆయన ఆరోగ్యంపై కాసేపట్లో హెల్త్ బులిటెన్ రానుంది. కాగా ఎజిఎం ఆసుపత్రిలో నలభైరోజులుగా కరోనా చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో కరోనా నుంచి కోలుకున్నాక ఆయన మళ్ళీ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఎజిఎం ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. తాజాగా మరోసారి అస్వస్థతకు గురికావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

ఆగ‌స్టు 5న కరోనా వైరస్ బారిన పడిన బాలసుబ్రహ్మణ్యం కోలుకున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ పెరగటంతో అప్ప‌ట్లో ఆయన ఆరోగ్యం క్షీణించింది. దాంతో అప్ప‌టి నుంచి ఆయన ఎక్మో సపోర్టుతో చికిత్స తీసుకుంటున్నారు. ఇదిలావుంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని వారం రోజుల కిందట ఆయన తనయుడు ఎస్పీ చరణ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దాంతో అభిమానుల్లో సంతోషం నెలకొంది. ఈ తరుణంలో మళ్ళీ ఆయన అస్వస్థతకు గురికావడంతో టెన్షన్ నెలకొంది.    

Tags:    

Similar News