September Bank Holiday: సెప్టెంబర్ లో సగం రోజులు బ్యాంకులకు సెలవులు.. పూర్తి వివరాలివే..!
September Bank Holiday: ఆదివారం నుంచి సెప్టెంబర్ నెల ప్రారంభం కాబోతోంది.నెలలో వినాయకచవితి, ఈద్ ఏ మిలాద్ వంటి పండగలు వస్తున్నాయి. వాటికి తోడు పలు కారణాలతో బ్యాంకులకు భారీగా సెలవులు వస్తున్నాయి. సెప్టెంబర్ లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం.
Bank Holidays: ఈమధ్య కాలంలో బ్యాంకులకు వెళ్లేవారి సంఖ్య బాగా తగ్గింది. అందరూ డిజిటల్ ట్రాన్సాక్షన్లు జరుపుతున్నారు. అందువల్ల బ్యాంకు బ్రాంచ్ కు వెళ్లాల్సిన అవసరం ఉండటం లేదు. కానీ రుణమాఫీ, లోన్స్ వంటివి కావాలంటే తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్లాలి. కొందరు అయితే రోజూ బ్యాంకులకు వెళ్తుంటారు. మరి అలాంటివారికి సెప్టెంబర్ నెలలో ఏ రోజు బ్యాంకు ఉంటుందో ..ఏ రోజు ఉండదో ముందే తెలిస్తే..దానికి అనుగుణంగా లావాదేవీలకు ప్లాన్ చేసుకోవచ్చు. సెలవుల గురించి వివరాలు తెలుసుకుందాం.
ఆదివారం బ్యాంకులకు సెలవు ఉంటుంది. అలాగే నెలలో రెండు, నాలుగు శనివారాల్లో సెలవు ఉంటుంది. ఇవే 6 రోజులు సెలవులు ఉంటాయి. అయితే సెప్టెంబర్ నెలలో 5 ఆదివారాలు ఉన్నాయి. 2 శనివారాలు ఉన్నాయి. అందువల్ల జనరల్ సెలవులే కాకుండా 7 సెలువులు ఉన్నాయి. వీటికి తోడు పండగలు, ఇతర కారణాల వల్ల మరో 8 రోజులు సెలవులు ఉన్నాయి. ఇలా మొత్తం 15 రోజులు సెలవులు ఉన్నాయి. అంటే నెలలో సగం రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే ఈ సెలవులు అన్ని చోట్లా ఒకే విధంగాఉండవు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ అంశాల ఆధారంగా సెలవులు ఉంటాయి. అయితే సెప్టెంబర్ 7న వినాయక చవితి, సెప్టెంబర్ 16న ఈద్ ఏ మిలాద్ సందర్భంగా మాత్రం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకూ సెలవులు ఉన్నాయి.
బ్యాంకుల సెలవుల జాబితా:
సెప్టెంబర్ 1 - ఆదివారం సెలవు.
సెప్టెంబర్ 4 - తిరుభావ తిథి కారణంగా గౌహతిలో బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్ 7 - వినాయక చవితి సెలవు.
సెప్టెంబర్ 8 - ఆదివారం సెలవు.
సెప్టెంబర్ 14 - రెండో శనివారం సెలవు.
సెప్టెంబర్ 15 - ఆదివారం సెలవు.
సెప్టెంబర్ 16 - ఈద్ ఏ మిలాద్ సెలవు
సెప్టెంబర్ 17 - ఇదా మిలాద్
సెప్టెంబర్ 18 - పాంగ్-లహబ్సోల్
సెప్టెంబర్ 20 - ఈద్ ఎ మిలాద్ ఉల్ నబీ
సెప్టెంబర్ 21 - శ్రీనారాయణ గురు దినోత్సవం
సెప్టెంబర్ 22 - ఆదివారం సెలవు.
సెప్టెంబర్ 23 - మహారాజా హరి సింగ్ జయంతి
సెప్టెంబర్ 28 - నాలుగో శనివారం సెలవు.
సెప్టెంబర్ 29 - ఆదివారం సెలవు.