Rahul Gandhi: జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాహుల్

Rahul Gandhi: జమ్ముకశ్మీర్‌లో ఇండియా కూటమి గెలుస్తోంది

Update: 2024-09-04 09:32 GMT

Rahul Gandhi

Rahul Gandhi: జమ్ముకశ్మీర్‌కి రాష్ట్ర హోదా తిరిగి తీసుకువస్తామని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అక్కడి ప్రజలకు హామి ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జమ్ములో రాహుల్ పర్యటించారు. జమ్ముకశ్మీర్‌లో ఇండియా కూటమి గెలుస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. జమ్ముకి రాష్ట్ర హోదా వచ్చిన తర్వాతే ఎన్నికలు జరగాలని తాము భావించామని... కానీ బీజేపీ అలా చేయలేదన్నారు. ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి జమ్ముకి రాష్ట్ర హోదా లభించేలా చేస్తామన్నారాయన.

Tags:    

Similar News