Puri Jagannath Ratna Bhandar: 46ఏండ్ల తర్వాత తెరచుకున్న పూరీ రత్నభాండాగారం..ఎంత సంపద ఉందో తెలుస్తే షాక్ అవుతారు

Puri Jagannath Ratna Bhandar:

Update: 2024-07-19 02:51 GMT

Puri Jagannath Ratna Bhandar: 46ఏండ్ల తర్వాత తెరచుకున్న పూరీ రత్నభాండాగారం..ఎంత సంపద ఉందో తెలుస్తే షాక్ అవుతారు

Puri Ratnabhandaram opened after 46 years

Puri Jagannath Ratna Bhandar:కోట్లాది మంది భక్తులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న పూరీ జగన్నాథుని రత్నభాండాగారం రహస్యగదిని 46ఏండ్ల తర్వాత ఎట్టకేలకు గురువారం తెరిచారు. భారీ పెట్టెలు, అల్మారాల్లో ఉన్న జగన్నాథుని ఆభరణాలు తాత్కాలిక స్ట్రాంగ్ రూముకు తరలించారు. ఒడిశాసర్కార్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన 11 మంది సభ్యుల సమక్ష్యలో గురువారం ఉదయం 9.51 గంటలకు రహస్య గది తలుపులు తెరిచారు. సాయంత్రం 5.15వరకు దశల వారీగా సంపను స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా శ్రీక్షేత్రం వెలుపల భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉదయం 8గంటల నుంచి భక్తుల ప్రవేశాలను కూడా నిలిపివేశారు. ముందస్తు జాగ్రత్తగా ఆలయం లోపల ఓడ్రాఫ్ జవానులన, స్నేక్ హెల్ప్ లైన్ ను సిద్ధంగా ఉంచారు. గ్యాస్ కట్టర్లు, హైమాస్ట్ దీపాలు, ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్లినా, వాటి అవసరం రాలేదని అధికారులు తెలిపారు. సాయంత్రం 6గంటలకు వెలుపలకు వచ్చిన జస్టిస్ రథ్, శ్రీక్షేత్ర పాలనాధికారి అరవింద పాడి మీడియాకు రత్నాభాండాగారం వివరాలను వెల్లడించారు.

రహస్య గదిలో సంపద ఎంత ఉందంటే?

రహస్య గదిలో 3 పెద్ద పెట్టలు ఉన్నాయి. వాటిలో రెండు కలప, ఒకటి స్టీల్ తో చేసిన ఉన్నవి. 4 భారీ సైజులో అల్మారాలు ఉన్నాయి. వాటిలో మూడు కలపతో తయారుచేసినవి ఉంటే ఒకటి స్టీల్ తో తయారు చేసింది ఉంది. ఈ అల్మారాల్లో చిన్న కంటైనర్ తరహా పెట్టెల్లో స్వామివారి ఆభరణాలు ఉన్నాయి. వాటి వివరాలను మాత్రం బహిర్గతం చేయకూడదని ప్రతిజ్ఞ చేశామని సభ్యులు తెలిపారు. కాబట్టి వాటిలో ఎంత సంపద ఉందో తెలియదు. అయితే స్వామి సంపద మొత్తంగా భద్రంగానే ఉందని తెలిపారు. ఎక్కడా కూడా చెక్కుచెదరలేదు. ఇక రహస్య గది నుంచి సొరంగమార్గం ఉందన్న అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల్లో దాని గురించి ప్రస్తావన లేదని తెలిపారు. పురావస్తు శాఖ ఈ భాండాగారం మరమ్మత్తులు చేస్తోంది. సొరంగ మార్గం గురించి , మరిన్ని రహస్య గదుల గురించి లేజర్ స్కానింగ్ ద్వారా సెర్చ్ చేయాలంటే ప్రభుత్వం అనుమతి తప్పని సరిగా ఉండాల్సిందే. ఇక రహస్య గదిలో పాములు, విష కీటకాలు ఏమీ లేవని జస్టిస్ బిశ్వనాథ్ రథ్ వివరించారు.

రహస్యగదులు, సొరంగ మార్గంపై భిన్న వాదనలు?

శ్రీ క్షేత్ర రత్న భాండాగారంలో రహస్య గదులు, సొరంగ మార్గాలు ఉన్నాయన్న విషయంపై అర్చకులు, పాలకుల నుంచి పలు విభిన్న వాధనలు వినిపిస్తున్నాయి. భాండాగారం నుంచి పురాతన రాజప్రసాదంవరకుసొరంగ మార్గం ఉందని దీనికి అనుసంధానంగా 5 రహస్య గదులు ఉన్నాయని జగన్నాథుడికి నిత్యం సేవలందించే జగన్నాథస్వయిన్ మహాపాత్ర్ మీడియాకు వెళ్లడించరు. సొరంగ మార్గంలో రహస్య గదుల్లో స్వామివారి సంపద ఉన్నట్లు మా తండ్రి నాకు చెప్పారని ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News